అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ అంశాన్ని తేల్చేందుకు సీరియస్ గా గ్రౌండ్ వర్క్ చేస్తుందా ? సెప్టెంబర్ నాటికి తెలంగాణ అంశాన్ని తేల్చేసి ఎన్నికల్లోకి వెళ్లాలని భావిస్తుందా ? మొన్న కోర్ కమిటి భేటీలో ఈ అంశం పై నిర్ణయాన్ని సీడబ్ల్యూసీలో తేలుస్తామని బంతిని సోనియా గాంధీ కోర్టులోకి నెట్టి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు సోనియా నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయం పై సోనియా గాంధీ పని ప్రారంభించనట్లు తెలుస్తుంది. ఈ నెలాఖరులోనో ఆ తరువాత జరిగే సీడబ్ల్యూసీ మీటింగ్ తరువాత అంటే రాజీవ్ గాంధీ పుట్టిన రోజున తెలంగాణ అంశం పై పని ప్రారంభించి, సెప్టెంబర్ కల్లా ముగించాలని భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. తెలంగాణ బిల్లు రూపకల్పనకు కేంద్రం కొందరు మంత్రులతో ఒక కమిటీని వేయవచ్చునని తెలుస్తున్నది. బిల్లు తయారీకి కనీసం రెండు నెలల కాలం పడుతుందని భావిస్తున్నారు. . కేబినెట్లో తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న అనంతరం ఈ విషయాన్ని రాష్ట్రపతికి తెలియజేసి తెలంగాణ జిల్లాల సంఖ్యను, ఆదాయ వనరుల వివరాలనూ అందులోనే సవివరంగా పేర్కొంటారని తెలుస్తున్నది.
రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌ను కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉంచుతారని తెలుస్తున్నది. ఈ ప్రక్రియ రెండు నెలల్లో ముగింప చేసి సోనియాగాందీ జన్మదినోత్సవం నాటికి రెండు రాష్ట్రాల ఏర్పాటు పూర్తి అవుతుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంచనా వేయడం విశేషం.ఆగస్టు పదిహేనున తెలంగాణ అంశాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తన ప్రసంగంలో ప్రస్తావించవచ్చని కూడా చెబుతున్నారు. అయితే తెలంగాణ నేతలు మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటల పై నమ్మకం లేదని అంటున్నారు. పంచాయితీ హడావుడి సందర్భంగా లేవనెత్తిన ఈ అంశాన్ని ఇదిగో, అదిగో అంటూ గతంలో నాన్చిన విధంగా నాన్చి , ఎన్నికల కోడ్ అంటూ మరికొన్ని రోజులు జరిపి 2014 ఎన్నికల ఎజెండాగా పెట్టుకుకొని ఓట్లకు దిగాలనే ఉద్దేశ్యంతో ఉందని, 2004లలో లాగ బయటపడాలని చూస్తుందని అంటున్నారు. మరి కాంగ్రెస్ ప్లాన్లు బాగానే ఈ సారి తెలంగాణ ప్రజలు వింటారా లేదా అన్నది ప్రశ్న. లేక తేల్చేసి తెలంగాణ ఇచ్చిన పేరును కాంగ్రెస్ పుటల్లోకి ఎక్కించుకుంటుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more