Minister chiranjeevi statement on telangana state issue

Chiranjeevi statement on telangana state issue, telangana state, andhra state, seemandhra agitation, chiranjeevi union minister, chiranjeevi fire on kcr, chiranjeevi serious on kcr, chiranjeevi three demands

Minister Chiranjeevi statement on telangana state issue

రాజధాని లేదంటే- చిరంజీవి రాజీనామా?

Posted: 08/03/2013 09:02 PM IST
Minister chiranjeevi statement on telangana state issue

 

సీమాంద్రలో ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి చిరంజీవి ఎట్టకేలకు నోరు విప్పారు. హైదరాబాదును రెండు రాష్ట్రాలకు శాశ్వత ఉమ్మడి రాజధానిగా చేయాలని, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోకపోతే రాజీనామా చేస్తానని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. చండీఘడ్ మాదిరిగా హైదరాబాదును చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, లేదంటే దేశానికి రెండో రాజధానిగా చేయాలని ఆయన అన్నారు. హైదరాబాదును రెండో రాజధానిగా చేయాలని డాక్టర్ అంబేడ్కర్ సూచించారని, అందుకు అనుగుణంగానే తాను డిమాండ్ చేస్తున్నానని ఆయన అన్నారు. దేశానికి హైదరాబాదును రెండో రాజధానిగా చేస్తూ, రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానికి శాశ్వతంగా ఉంచవచ్చునని ఆయన అన్నారు. హైదరాబాదు విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉండాలని తాను కాంగ్రెసు పార్టీ అధిష్టానం పెద్దలకు చెప్పినట్లు ఆయన తెలిపారు. తాను సమైక్యవాదినని, అయితే రాష్ట్రం రావణకాష్టంగా మారుతుంటే అధిష్టానం విభజనకు నిర్ణయం తీసుకుందని, అది అనివార్యంగా మారిందని, దాంతో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నానని ఆయన వివరించారు.

 

అయితే, రాష్ట్ర విభజన విషయంలో ఎక్కడ అన్యాయం జరుగుతుందో గుర్తించి, అలా జరగకుండా చూస్తానని, అందుకే హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేయాలని కోరుతున్నానని ఆయన చెప్పారు. తమ అభ్యంతరాలను వినేందుకు ఏర్పాటు చేసే ఉన్నత స్థాయి కమిటీకి రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ సారధ్యం వహిస్తారని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అత్యధిక పార్టీల అభిప్రాయం మేరకే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆయన అన్నారు. కెసిఆర్‌కు తెలంగాణ కావాలా, వద్దా ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలని కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి తీవ్రంగా ప్రతిస్పందించారు. సీమాంధ్ర ఉద్యోగులపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రెచ్చగొట్టడం కొనసాగిస్తే పరిణామాలు మరో విధంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.  సీమాంధ్ర ప్రజలకు అభద్రతా భావం కలిగేలా కెసిఆర్ మాట్లాడారని ఆయన అన్నారు. తెలంగాణ వస్తే కెసిఆర్ రాజకీయ నిరుద్యోగి అవుతారని ఆయన అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలని అనడానికి కెసిఆర్ ఎవరని ఆయన అడిగారు. రాష్ట్ర విభజనపై చిరంజీవి, దిగ్విజయ్ సింగ్ మాటలను సీమాంధ్ర ప్రజలు అంగీకరించబోరని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. హైదరాబాదును పంచుకుందామని చిరంజీవి చెప్పినా, హైదరాబాదు కన్నా మంచి రాజధానికి సహకరిస్తామని దిగ్విజయ్ సింగ్ చెప్పినా సీమాంధ్ర ప్రజలు వినబోరని ఆయన అన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more