ముంబైలోని ప్రభుత్వ వైద్య కేంద్రాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు (ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ) చేయించుకుంటున్న వారిలో సగం మంది 20 ఏళ్ల వయసు వారే ఉంటున్నారు. ఒకరిద్దరు సంతానం కలిగిన తర్వాత దంపతులు ఇక పిల్లలు పుట్టకుండా ఉండేందుకు ఆ ఆపరేషన్లు చేయించుకోవాలి. దేశవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమం కింద ఈ ఆపరేషన్లను ప్రభుత్వ వైద్య కేంద్రాలలో ఉచితంగానే చేస్తుంటారు. కానీ, ముంబైలో యువతీ, యువకులు మాత్రం గర్భనిరోధక సాధనాలుగా వీటిని భావిస్తున్నారు. లైంగిక కార్యంలో పాల్గొన్నా గర్భం రాకుండా ఉండేందుకు ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ చేయించుకుంటున్నారట. 2011-12లో 10,770 మందికి ప్రభుత్వ వైద్య కేంద్రాలలో ఇలాంటి ఆపరేషన్లు జరిగాయి. వీరిలో 5,336 మంది 20 నుంచి 29 ఏళ్లలోపు వారేనని బీఎంసీ గణాంకాలు వెల్లడించాయి. వీరిలోనూ ఒక వంతు మంది 25 ఏళ్లలోపు వారున్నారు. ఈ ఆపరేషన్లపై ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని నిపుణులు అంటున్నారు. ఉద్యోగం చేయని మహిళలు, అలాగే చదువుకోని మహిళలు ఈ ఆపరేషన్లను గర్భనిరోధక సాధనాలుగా భావిస్తున్నారని చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more