విభజన విషయంలో తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తప్పు ఏమీ లేదని, ఆయన ప్రత్యేక తెలంగాణ అడగలేదని.. రెండో ఎస్సార్సీ కోసం నాటి పిసిసి అధ్యక్షుడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద ఒప్పందంపై సంతకాలు కూడా చేశారని గుర్తు చేశారు. తెలంగాణ అనే రాష్ట్రం లేదని, విశాలాంధ్ర ఉద్యమ సమయంలో చెన్నారెడ్డి 8 జిల్లాలను కలిపి ఒక రాష్ట్రంగా ఇవ్వాలని కోరినా, అప్పట్లో కాంగ్రెస్ పెద్దలు అంగీకరించలేదని అన్నారు. నేను 1952లోనే హైదరాబాద్‌కు చదువుకోవడానికి వచ్చానని, అప్పట్లో తమకు ఇలాంటి సమస్యలు లేవని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల బాష్కరావు తెలిపారు. రాజకీయ పార్టీలు విఫలమవ్వడం వల్లనే ప్రజలు రోడ్డెక్కుతున్నారని నాదెండ్ల అభిప్రాయపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఇక ముఖ్యమంత్రి కాలేనన్న నిరాశతో తెలంగాణ విభజన అంశం తెచ్చి గందరగోళం స్రుష్టించారు. ఆ సమయంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్దకు ఇరవై మంది ఎమ్మెల్యేల సంతకాలతో వినతి పత్రం తీసుకు వెళ్లారని, అప్పడు తాను ప్రత్యక్ష సాక్షినని మాజీ ముఖ్యమంత్రి, ఏఐసిసి సభ్యులు నాదెండ్ల భాస్కర రావు ఆరోపించారు. రాష్ట్ర విభజన కాలేదని, కాదని.... తాను చెప్తున్నానని, అధిష్టానం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుందని, ప్రజాభిప్రాయాలను పార్టీలు చెప్పలేవని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం విభజన నిర్ణయం వెనక్కి తీసుకుని.. ఇరువైపులా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రజల నాడిని పట్టుకోవడంలో ఒక్క సిపిఎం తప్ప మిగిలిన రాజకీయ పార్టీలన్నీ విఫలమయ్యాయని, ప్రజల కోరికలను అవి తెలుసుకోలేకపోయాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ విభజనను ఆపాలని కాంగ్రెస్ హైకమాండ్‌కు ఏఐసిసి సభ్యుడిగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ప్రజాభిప్రాయం ప్రకారం నిర్ణయం మార్చుకోవడంలో తప్పులేదని, అది కూడా రాజనీతిలో భాగమని, నిర్ణయాలు మార్చుకున్న పరిణామాలు గతంలో ఎన్నో జరిగాయని పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్రంలో అన్ని వర్గాలనూ సంప్రదించి నివేదిక ఇచ్చింది శ్రీకృష్ణ కమిటీ మాత్రమేనని నాదెండ్ల బాస్కరావు అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more