శివకాశి అనగానే మనకు గుర్తుకొచ్చేవి రెండే రెండు ఒకటి గీయగానే భగ్గుమనే అగ్గిపుల్ల, రెండవది దీపావళికి కాల్చే బాణా సంచా. అయితే శ్రీదేవి కూడా ఆ ప్రాంతంలో జన్మించినదే. అందుకేనేమో దేశ సినీ చిత్ర పరిశ్రమలోనే ఒక ధమాకాలా వెలుగొందిందామె. ఈ సారి తమిళనాడులోని శివకాశి గుర్తుకు రాగానే ఆమెను కూడా గుర్తుచేసుకుందాం
ఆగస్ట్ 13, 1963 అంటే సరిగ్గా 50 సంవత్సరాల క్రితం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలలో తన నాల్గవ ఏటి నుంచీ బాల కళాకారిణిగా మొదలుపెట్టి హీరోయిన్లలో దేశంలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించిన శ్రీదేవి అయ్యప్పన్, బోనీ కపూర్ తో 1996లో జరిగిన వివాహంతో శ్రీదేవి కపూర్ గా మారింది. కానీ ఆమెలోని సహజ సౌందర్యం తగ్గలేదు, నటనా పటిమా తగ్గలేదని అనటానికి 15 సంవత్సరాల విరామం తర్వాత 2012 లో వచ్చిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రమే సాక్ష్యం.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'క్షణ క్షణం' సినిమాలో ఆమె నటనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు నంది పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఇంకా ఆమెకు తమిళ, కేరళ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పురస్కారాలు లభించాయి. వీటితో పాటుగా 2012 వరకు 5 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్ఢ్ లు, అక్కినేని లైఫ్ టైం అఛీవ్ మెంట్ మరో 18 అవార్డ్ లు కూడా అందుకున్న శ్రీదేవి ఒక్కసారిగా 2013 లో స్టార్ డస్ట్ అవార్ఢు, గిల్డ్ ప్రెసిడెండ్ అవార్ఢు, టిఎస్ఆర్ టివి-9 అవార్డు, ఇండియా టుడే, ఎన్ డి టివి నుంచి అవార్ఢులు అందుకోవటమే కాక భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ కూడా అందుకున్నారు.
తెలుగులో అందరు అగ్రనాయకులతోనూ నటించిన శ్రీదేవి తను చిన్నప్పుడు మనుమరాలిగా నటించిన ఎన్టీఆర్ కి నాయకిగా కూడా నటించారు. హిందీ చిత్రరంగంలో రాణింపు పొందిన తర్వాత కూడా తెలుగులో క్షణక్షణం, గోవిందా గోవిందా లాంటి సినిమాల్లో ఆమె నటించారు.
పదహారేళ్ళ వయసుకి హిందీ రూపాంతరమైన సోల్వా సావన్ సినిమా ద్వారా 1979లో హిందీ చిత్రరంగంలో అడుగుపెట్టిన శ్రీదేవి 1983లో 'సద్మా' సినిమాతో అందరి మనసులనూ చూరగొని స్టార్ డమ్ ని సంపాదించుకున్నారు. అమితాభ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి, ఋషి కపూర్, అనిల్ కపూర్ లలాంటి అగ్రనాయకులతో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.
అందానికి అందం, సోయగం, శృంగారం, చిలిపితనం, వీటితో పాటు ఆరితేరిన నటనా చాతుర్యం- వీటితో శ్రీదేవి బాల కళాకారిణిగానూ, 16 ఏళ్ళ వయసులోనూ, నాయికగా, ఫ్రౌడ వయసులోనూ కూడా ప్రేక్షకులను మెప్పించగలిగారు.
శ్రీదేవి ఇంకా పది కాలాలపాటు సంపూర్ణారోగ్యంతో సినిమాలాంటి కళాక్షేత్రంలో చురుగ్గా పాల్గొంటూ ఈరోజు చేసుకునే జన్మదినం లా మరెన్నో జన్మదిన వేడుకలను చేసుకోవాలని ఆశిస్తూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది విశేష్ కుటుంబంలోని తెలుగు విశేష్.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more