Pvp and pawan diferences

Potluri Vara Prasad, Pawan Kalyan, TDP, PVP Vijayawada MP seat

Differences between PVP and Pawan due to Vijayawada MP seat

పొట్లూరి,పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు?

Posted: 04/24/2014 10:48 PM IST
Pvp and pawan diferences

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపన వెనుక పొట్లూరి వర ప్రసాద్ ప్రధానంగా ఉన్నారనే ప్రచారం అప్పుడు జోరుగా సాగింది. విజయవాడ లోకసభ స్థానం కోసమే పొట్లూరి పవన్‌తో పార్టీ పెట్టించారనే కామెంట్స్ కూడా వినిపించాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మిత్రుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్‌ల మధ్య విభేదాలు వచ్చాయా? అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయవాడ లోకసభ స్థానం గురించే వీరిద్దరి మధ్య పొరపొచ్చలు వచ్చాయంటున్నారు.

విజయవాడ లోకసభ స్థానం కోసం పివిపి పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు. స్వయంగా పవన్ కూడా టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో టిక్కెట్ విషయమై అడిగినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, చంద్రబాబు.. పవన్ ప్రతిపాదనను పక్కన పెట్టి మొదటి నుండి అనుకున్న అభ్యర్థి కేశినేని నానికే ఇచ్చారు. దీనిని జీర్ణించుకోలేని పొట్లూరి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోగి దిగాలని భావించి.. పవన్ మద్దతు కోరారు. దానికి పవన్ సున్నితంగా నో చెప్పినట్లుగా ప్రచారం జరిగింది.

రెండుమూడు రోజులుగా పివిపి, పవన్‌లు దూరం దూరంగా ఉంటున్నారట! పివిపి పారిశ్రామికవేత్తనే కాకుండా సినీ నిర్మాత కూడా. ఈ నేపథ్యంలో ఆయన పవన్‌తో వచ్చే ఏడాది ఓ భారీ సినిమా తీయాలని భావించారట. ఇప్పుడు విభేదాల కారణంగా ఆ సినిమాకు అవకాశం లేకపోవచ్చునని అంటున్నారు.



If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more