మీనా ఆవేశంతో ఊగిపోయారు. కాదు... కాదు ఆవేశంగా రెచ్చిపోయి.. వెంటనే వారిని అరెస్టు చేసి .. జైల్లో పెట్టండని ఆదేశాలు జారీ చేయటం జరిగింది. అసలు మీనాకు అంతగా ఆవేశం కలగటానికి కారణం ఉంది. ఇటీవల కాలంలో.. విద్య అనేది ఒక వ్యాపారం అయిన విషయం తెలిసిందే. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎంత మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయో లిఖిత పూర్వకంగా జాబితాలు ఇవ్వండిన అడిగితే ఏకంగా 770 పాఠశాలలు స్పందించలేదు.
దీంతో కేసిఆర్ సర్కార్ ఆదేశాలు పాటించని ఆయా యాజమాన్యాలపై చర్యలు తీసుకొని, వెంటనే వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండని హైదరబాద్ జిల్లా కలెక్టర్ ముఖేశ్ కుమార్ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన ప్రైవేటు బడుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయటం జరిగింది. హైదరాబాద్ నగరంలో 2107 ప్రైవేటు బడులు ఎంత మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయో వెల్లడించాలని పక్షం రోజల కిందట జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
అయితే నగరంలో 770 పాఠశాలు స్పందించకపోవడాన్ని కలెక్టర్ తప్పుబట్టారు. ప్రాథమిక పాఠశాలల్లో ఏడాదికి రూ. 9 వేలు, ఉన్నత పాఠశాల్లో రూ. 12 వేలు మాత్రమే రుసుములు రూపేణా తీసుకోవాల్సి ఉంటుందని, అంతకు మించి ఒక్క పైసా కూడా ఎక్కువుగా తీసుకోవద్దని ఆయన ప్రైవేటు పాఠశాలలకు సూచించారు. కానీ నగరంలో 99 శాతం పాఠశాలలు నిబంధనల్ని తుంగలో తొక్కటంతో.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయటం జరిగింది.
మనం ఇక్కడ కూర్చున్నది చట్టాల్ని అమలు చేయటానికి మాత్రమే. విద్యాశాఖకు కొన్ని జీవోలు , చట్టాలు నిబంధనలు ఉన్నాయి. వాటిని అమలు చేయకుంటే మాత్రం మీరంతా ఆయా కూర్చీల్లోంచి లేసి వెళ్లిపోండి? అని మీనా అధికారులు పై మండిపడ్డారు. మనం సమాచారం అడిగితే ఇవ్వని పాఠశాలలకు తాళం వేసి, నిర్వాహకుల్ని అరెస్టు చేయించి జైల్లో పెట్టించండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేయటం జరిగింది. కేవల మూడు రోజుల్లో అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఎంత మొత్తంలో ఫీజులు చెల్లించాలో ప్లెక్సీల రూపంలో ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయించాలని డీఈవోను ఆదేశించారు.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more