(Image source from: most Married couple getting suicides according to National crime record bureau report)
ప్రస్తుత భారతదేశంలో రానురాను ఆత్మహత్యలు చేసుకునేవారు చాలా ఎక్కువయిపోతున్నారు. కొంతమంది గృహ సమస్యల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటే... మరికొందరు అప్పుల బాధల వల్ల ప్రాణాలను కోల్పోతున్నారు. సమస్యలు, కారణాలు ఏవైనా కావచ్చు.... ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య రోజురోజుకు అంచనాలకు దాటి మించిపోతోంది. గతంలో నమోదయిన ఈ గణాంకాల కంటే... ప్రస్తుతం విడుదలవుతున్న రిపోర్టులు మరీ దారుణంగా వున్నాయి. స్కూల్లో చదువుకునే పిల్లల నుంచి వృద్ధులు దాకా... రకరకాల సమస్యలతో తమ ప్రాణాలను తామే బలి తీసేసుకుంటున్నారు.
ఈ సందర్భంగానే జాతీయ నేర నమోదు బ్యూరో (ఎన్సీఆర్బీ) ఆత్మహత్యలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. కుటుంబ సమస్యలు ఎక్కువ లేకుండా ఒంటరిగా జీవితాన్ని గడిపేవారి కంటే... పెళ్లయిన వారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈ సంస్థ పేర్కొంది. చాలావరకు భార్యాభర్తల మధ్య సంబంధం సరిగ్గా కుదరకపోవడం వల్ల, ఇద్దరి మధ్య అనుమానాలు రేకెత్తించుకోవడం వల్ల లేదా నిత్యం గొడవల కారణంగా ఇద్దరిలో ఎవరో ఒకరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎన్సీఆర్బీ తమ నివేదికలో పేర్కొంది.
గత సంవత్సరం 2013లో సర్వేలు నిర్వహించిన ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం... 23.6 శాతం ఒంటరిగా వున్నవారు ఆత్మహత్యలు చేసుకుంటే... 69.4 శాతం వివాహితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తేల్చి చెప్పింది. వీరితోపాటు వితంతువులు కూడా కొన్ని ప్రలోభాలకు గురయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారు చెప్పారు. వీరి శాతం కూడా 3.7 వరకు వుందని ఆ సంస్థ తమ నివేదికలో పేర్కింది. కాబట్టి వివాహం చేసుకునేముందే భాగస్వామిని ఎంచుకోవడంలో మంచి నిర్ణయాలు తీసుకుంటే జీవితం కూడా సాఫీగా కొనసాగుతుందని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more