(Image source from: pawan kalyan to announce janasena party symbol fist on august 15)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ‘‘ప్రజల సంక్షేమం కోసం నేనున్నా... అధికారం సరిగ్గా చెలాయించని నాయకులను ప్రశ్నించడానికే ముందుకొస్తున్నా’’ అంటూ ‘‘జనసేన’’ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే! అయితే అప్పట్లో పోటీ చేసేందుకు పార్టీ అభ్యర్థులు లేకపోవడం కారణంగా ఆ పార్టీకి గుర్తుగానీ, రాజకీయ హోదాగానీ దక్కలేదు. దాంతో ఆయన బీజేపీ - టీడీపీ పార్టీలకు మద్దతుగా ప్రచారాలు చేసి, ప్రజలకు తెలియని కొన్ని రహస్య నిజాలను బయటపెట్టేశారు. అయితే ఇదంతా గతం!
తాజాగా పవర్ స్టార్ త్వరలోనే ఉగ్రరూపం దాల్చుతున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీన తన పార్టీ ఎన్నికల గుర్తును ప్రకటించనున్నట్లు ఆయన అన్నారు. కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో జనసేన పార్టీకి వ్యతిరేకంగా ప్రచారాలు సాగాయి. కొంతమంది ఈయన పేరును, పార్టీ పేరును ఉపయోగించుకుని చందాలను వసూలు చేస్తున్నట్లు పవన్ టీం అప్పట్లో వెల్లడించారు కూడా! అటువంటి విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకే జనసేన పార్టీ ఎన్నికల గుర్తింపును ఆగస్టు 15వ తేదీన ప్రకటించాలని ఆ పార్టీవర్గాలు భావిస్తున్నాయి.
జనసేన పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేడానికి పవన్ కల్యాణ్ కూడా తనవంతు పూర్తి కసరత్తు ప్రారంభించారు. ఓవైపు ‘‘గోపాలా గోపాల’’ సినిమా షూటింగ్ లో బిజీగా వుంటూనే.. మరవైపు జిల్లాలవారీగా కమిటీల ఏర్పాటుకు పవన్ తన అనుచరులతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతోపాటు మిగతా రాష్ట్రాల్లో కూడా విస్తరించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం! అన్నట్టు పవన్ తన పార్టీ గుర్తుగా ‘‘పిడికిలి’’ని ఎంచుకున్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అంటే త్వరలోనే పవన్ రాజకీయ రణరంగంలో ఉగ్రరూపం దాల్చడానికి సిద్ధమవుతున్నారన్నమాట!
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more