స్మార్ట్ ఫోన్ల విషయంలో అత్యంత ప్రభావాత్మకమైన కంపెనీగా పేరు తెచ్చుకున్న ‘‘యాపిల్’’ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజుందో అందరికీ తెలిసిందే! ఆ కంపెనీ నుంచి విడుదలయ్యే ఐఫోన్లు, ఐప్యాడ్ లు వంటివి మార్కెట్ లో రిలీజైన వెంటనే పోటీపడి మరీ అమ్ముడుపోతుంటాయి. కొంతమంది ఈ యాపిల్ కంపెనీకి పిచ్చఫ్యాన్స్ కూడా వున్నారు. అందులో ముఖ్యంగా ఐఫోన్లు అంటే మరీ దారుణంగా పడిచచ్చేవాళ్లు వున్నారు.
ఇంతటి భారీ ఫాలోయింగ్ వున్న ఈ కంపెనీ మాత్రం భారతీయుల వెంట పడుతోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీకి భారతీయ ఉద్యోగులే వెన్నెముక అని వారు ఆ లెక్కలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే.. ఈ కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ముగ్గురిలోనూ ఒకరు భారతీయులు వున్నారని అవి తేల్చి చెబుతున్నాయి. ఈ కంపెనీలో ఇంజనీరింగ్ విభాగం నుంచి మార్కెటింగ్ విభాగం వరకూ భారతీయ ఉద్యోగులే కీలకపాత్ర పోషిస్తున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
యాపిల్ ప్రధాన కేంద్రం అయిన అమెరికాలో 47,000మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 7,700 మంది ఉద్యోగులు కస్టమర్ సర్వీస్ ఆపరేటర్లుగా వున్నారు. వీరితోపాటు మరో 27,350 మంది ఉద్యోగస్తుల యాపిల్ కంపెనీ స్టోర్లలో పనిచేస్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీలో పనిచేస్తున్నవారు 80,000 మంది ఉద్యోగులు వుండగా.. అందులో మూడోవంతు మన భారతీయులే వున్నారట! అంటే దాదాపు పాతికవేల మంది వరకు యాపిల్ కంపెనీలో మన ఇండియన్సే!
యాపిల్ కంపెనీకి అప్లికేషన్ డెవలప్ మెంట్, వాటి నిర్వహణ, బిజినెస్ ఇంటెలిజెన్స్, డేటా వేర్ హౌసింగ్, డేటా ఎనాలసిస్ లలో భారతీయులే మూలధారమని ప్రస్తుత గణాంకాలు తేల్చి చెబుతున్నాయి. యాపిల్ కంపెనీ నిర్వాహకులు కూడా తమ సంస్థలో భారతీయుల్ని భుజాన ఎత్తుకుని పూజిస్తున్నారని కొంతమంది పేర్కొంటున్నాయి. ప్రపంచాన్ని తన టెక్నాలజీతో అదుపులో వుంచుకున్న అటువంటి యాపిల్ కంపెనీలో.. మన భారతీయులు ప్రధాన పాత్ర పోషించడం ఎంతో విశేషమైన విషయమే! ‘‘దటీజ్ ఇండియా’’!
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more