ఎంసెట్ కౌన్సెలింగ్‌పై న్యాయస్థానం సోమవారం విచారణ జరిపి,స్థానికత పైన ఉమ్మడి రాష్ట్రంలోని నిబంధనలే వర్తిస్తాయని ,ఆగస్టు 31వ తేదీ లోగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారం (11వ తేదీ) నాటికి వాయిదా వేసింది. ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
స్థానికత అంశం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉంటుందని, స్థానికత అంశం అడ్మిషన్లకు ముడిపెట్టవద్దని థర్మాసనం పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దని సుప్రీం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు హితవు పలికింది. సెప్టెంబరు మొదటి వారంలో తరగతులను ప్రారంభించాలని ఆదేశించింది.
కౌన్సెలింగ్ కోసం అక్టోబర్ వరకు సమయమివ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే కౌన్సెలింగ్ ప్రారంభించాలని కోరిన విషయం విధితమే. రాష్ట్ర విభజనకు, విద్యార్థులకు సంబంధం లేదని తెలిపింది.
విద్యార్థుల భవిష్యత్తు పైన రాజకీయాలు వద్దని హితవు పలికింది. సెప్టెంబరు మొదటి వారంలో తరగతులు ప్రారంభించాలని న్యాయస్థానం ఆదేశించింది. సమయం ఇస్తే సమస్యలు పెరుగుతాయని, ప్రవేశాల పైన రాజకీయ ప్రభావం ఏమాత్రం ఉండవద్దని, విద్యార్థుల పైన విభజన ప్రభావం పడవద్దని, తెలంగాణ, ఆంధ్రా విద్యార్థులంటూ వేర్వేరుగా చూడొద్దని సుప్రీంకోర్టు హితవు పలికింది. ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ప్రకారం కౌన్సెలింగ్‌కు వెళ్లాలని ఆదేశించింది. పూర్తి స్థాయి తీర్పును సోమవారం (11న) సుప్రీం కోర్టు వెల్లడించనుంది.
సుప్రింకోర్టు తీర్పు తమ వాదనను బలపరిచిందని విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.ఎవరైనా రాజ్యాంగానికి అనుకూలంగానే వ్యవహరించాలని స్ఫష్టమైందని ఆయన అన్నారు.
మంత్రి కిషోర్ మాట్లాడుతూ తాము మొదటి నుంచి ఇదే విషయం చెబుతున్నామని అన్నారు.స్థానికత అని,మరొకటని చెబుతూ లేనిపోని వివాదాలు సృష్టిస్తూ తెలంగాణ ప్రభుత్వం పొమ్మనకుండా పొగ పెట్టడానికి ప్రయత్నం చేసిందని ఆయన అన్నారు.స్థానికత మీద గందరగోళం సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ది పొందడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించిందని కిషోర్ అన్నారు. విద్యార్ధుల విషయంలో రాజకీయం చేయరాదని తాము మొదటి నుంచి అబిప్రాయపడుతున్నామని ఆయన చెప్పారు.
సుప్రింకోర్టు ప్రత్యేకంగా తీర్పు ఇవ్వలేదని,వారు అబిప్రాయం మాత్రమే చెప్పారని టిఆర్ఎస్ ఎమ్.పి వినోద్ వ్యాఖ్యానించారు.న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేస్తుంటారని,పూర్తి తీర్పు కాపీ వచ్చాక తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తుందని వినోద్ అన్నారు. సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పును ఎవరైనా పాటించవలసి ఉంటుందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more