యుద్దం అనేది దేశాల మద్య, ఇద్దరి వ్యక్తుల మద్య జరుగుతుంది. కానీ ఇక్కడ నల్ల కోతిపై యుద్దం చేయటానికి సిద్దమైంది వీకీపీడియా. మూడేండ్ల కిందట సొంతంగా ఫొటో (సెల్ఫీ) తీసుకొని సంచలనం సృష్టించిన ఇండోనేషియాకు చెందిన ఓ నల్లజాతి కోతి మళ్లీ హాట్ టాఫిక్‌గా మారింది. ఇప్పుడా సెల్ఫీ యాజమాన్య హక్కులపై ప్రముఖ వెబ్‌సైట్ వీకీపీడియా-ఓ ఫొటోగ్రాఫర్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతున్నది.
తమ వెబ్‌సైట్ నుంచి సెల్ఫీని తొలగించడానికి వీకీపీడియా నిరాకరిస్తున్నది. ఈ సెల్ఫీపై కోతికి పూర్తి యాజమాన్య హక్కులు ఉన్నాయని, దీనితో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ స్లాటర్‌కు ఎలాంటి హక్కు లేదని వీకీపీడియా వాదిస్తున్నది. ఇది ఓ జంతువు సొంతంగా చేసిన పని. దీనికి సంబంధించి మనిషికి ఎలాంటి కాపీరైట్స్ లేవు. అందుకే ఈ ఫొటోను మా పబ్లిక్ డొమైన్‌లో వాడుకుంటున్నాం అని వీకీపీడియా సైట్ ఓ సందేశాన్ని పెట్టింది.
అంతరించే ముప్పు ఎదుర్కొంటున్న ఈ నల్లరంగు జాతి కోతులను 2011లో ఫొటోగ్రాఫర్ డేవిడ్ స్లాటర్ ఫొటో తీస్తుండగా.. అవి ఆయన కెమెరాను ఎత్తుకెళ్లాయి. దానితో వందల ఫొటోలు తీశాయి. అందులో ఈ సెల్ఫీతోపాటు ఎన్నో అద్భుతమైన ఫొటోలు ఉన్నాయి. నల్లరంగు కోతి సొంతంగా తీసుకున్న ఈ ఫొటో అనతికాలంలో ప్రపంచమంతటా ప్రాచుర్యం పొందింది. ఈ క్రమంలో తన అనుమతి లేకుండా వీకీపీడియా ఈ ఫొటోను వాడుకోవడంపై లీగల్ చర్యలు తీసుకోవాలని డేవిడ్ భావిస్తున్నారు. చివరకు ఆ నల్లకోతి ఎవరికి చెందుతుందో చూడాలి.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more