ప్రస్తుతకాలంలో దెయ్యాలు వుంటాయో లేవో తెలీదు కానీ... శ్మశానంలో ఒక దెయ్యం సంచరించినందుకు బ్రిటన్ కోర్టు దానికి జరిమానా విధించింది. ఇదిమరీ విడ్డూరంగా వుంది .(అయినా దెయ్యాలు శ్మశానంలో కాకుండా ఇంకెక్కడుంటాయి..? మీరే చెప్పండి). అయితే ఇక్కడో చిన్న తిరకాసు.. అది నిజమైన దెయ్యం కాదులెండి! మానవరూపంలో వున్న ఒక దొంగ దెయ్యం.
బ్రిటన్ లో చెందిన ఆంటోని స్టాలార్డ్ తన మిత్రునితో కలిసి పోర్ట్స్ మౌత్ లోని కింగ్ స్టన్ శ్మశానవాటికకు కొంచెం దగ్గరలో ఫుట్ బాల్ ఆడుతున్నాడు. ఇంతలోనే కొంతమంది వ్యక్తులు శ్మశానవాటికలో తమ ఆప్తులకు నివాళులు అర్పించేందుకు వచ్చారు. దీంతో వారిని గమనించిన ఆంటోనికి ఓ చిలిపి ఆలోచన వచ్చింది. తన కామెడీ కోసం వారందర్నీ భయపెడితే ఎలా వుంటుందని అనుకున్న అతడు... శ్మశానవాటికలో ఆ వ్యక్తులకు కొంతదూరంలో వెనక్కి నడుస్తూ దెయ్యంలా శబ్దాలను చేశాడు. అంతే.. అక్కడున్న వారందరూ అడ్రస్ లేకుండా పోయారు. క్షణాల్లోనే ఆ శ్మశానవాటిక మొత్తం ఖాళీ అయిపోయింది.
తీవ్ర భయభ్రాంతులకు గురైన జనం.. దారిలో పరుగులు తీస్తూ వెళుతుండగా దారిలో పోలీసులు కనిపిస్తారు. దీంతో వారు జరిగిన మొత్తం తతంతాన్ని వివరించారు. అయితే ఈకాలంలో దెయ్యాలు ఎక్కడినుంచి పుట్టుకొచ్చాయబ్బా అని భావించిన ఆ పోలీసులు.. అసలు ఆ దెయ్యం సంగతేంటో తెలుసుకుందామని శ్మశానవాటికకు చేరుకుని ఆరా తీస్తే.. అక్కడ వారికి ఆంటోని కనిపించాడు. దీంతో ఇతడే దెయ్యం వేషం వేసుకుని అందరినీ భయపెట్టించాడని తెలుసుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇటీవలే ఈ కేసు విషయం మీద విచారించిన కోర్టు.. ఇంకెప్పుడూ ప్రజలను భయపెట్టవద్దంటూ అతని ఆదేశించింది. అతడు చేసిన ఘనకార్యానికి 75 పౌండ్ల జరిమానా విధించింది. ఇందులో 20 పౌండ్లు బాధితులకు, మరో 20 పౌండ్లు కోర్టు ఖర్చులకు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఈ దొంగ దెయ్యం విషయం బ్రిటన్ మొత్తం పాకిపోయింది.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more