(Image source from: yoyo honey singh injured in indias raw star reality show)
యోయో హనీసింగ్.. భారతదేశంలో సంచలన ర్యాప్ - పాప్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మొట్టమొదటి మ్యూజిక్ కంపోజర్! యోయో.. ఈ రెండు అక్షరాలు వింటే చాలు.. చిన్నాపెద్దా తేడా అని లేకుండా అందరూ ఊగిపోతారు. ఎందుకంటే.. అతని పాటలు యావత్తు దేశంమొత్తం మీద సరికొత్త సంచలనాన్నే సృష్టించాయి. వినడానికి చాలా విచిత్రంగా వున్నప్పటికీ... ఆ పాటలకే పిచ్చ ఫ్యాన్స్ వున్నారు. ఇక యూత్ లో అయితే ఇతని ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఇతని పాటలు వింటూ, వీధుల్లో స్టెప్పులేస్తుంటారు. అంతెందుకు.. ప్రస్తుతం వస్తున్న బాలీవుడ్ మూవీలన్నింటినిలోని ఇతనిది ఒక్క పాట ఖచ్చితమైపోయింది. సాధారణంగా సినిమాల్లో ఇంతకుముందు ఐటమ్ సాంగ్ లకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు... కానీ ఇప్పుడలా కాదు! ఆ ఐటమ్ సాంగ్ లను హనీసింగ్ పాటలతో భర్తి చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అదీ అతని క్రేజ్!
అటువంటి రాక్ స్టార్ తాజాగా ఓ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. హనీసింగ్ తాజాగా తన స్వీయనిర్మాణంలో ‘‘ఇండియాస్ రా స్టార్’’ రియాలిటీ షోను తీసుకొస్తున్న విషయం తెలిసిందే! ఈ రియాలిటీ షో షూటింగ్ లో భాగంగానే హనీ గాయపడ్డాడు. మొదటి ఎపిసోడ్ లోని చిట్టచివరి విభాగం కోసం భారీగా నిర్మించిన సెట్ లో షూట్ చేస్తుండగా.. యోయో కిందకు జారిపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా కేవలం ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని తిరిగి షూటింగ్ కొనసాగించాడు. దీంతో ఇతను ప్రదర్శించిన ఈ సాహసానికి నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు.
‘‘ఇండియాస్ రా స్టార్’’ షోలో పోటీ చేసేవాళ్లకు హనీసింగ్ ఒక మంచి స్నేహితుడిగా, మెంటోర్ గా, మార్గదర్శకుడిగా కనిపిస్తాడని షో నిర్వాహకులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారని.. ఈ టైటిల్ ను తమ సొంతం చేసుకోవడానికి బాగానే పోటీపడుతున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా ప్రముఖ మోడల్ - నటి గౌహర్ ఖాన్ వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు. ప్రముఖ ఛానెల్ అయిన స్టార్ ప్లస్ లో ఈ షో ఆదివారాల్లో ప్రసారం కానుందని వారు స్పష్టం చేశారు. చివరగా.. గాయపడిన హనీసింగ్ కు ఎటువంటి ప్రమాదం లేదని వారు చెప్పారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more