దివంగత టీడీపీ పార్టీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్య జరిగి చాలాకాలమే అయింది. ఈయన హత్య జరిగిన మరుక్షణం నుంచి పెద్ద దుమారాలే రేగాయి. ఎవరుపడితేవారు.. ఎక్కడబడితే అక్కడ ప్రత్యర్థులు నరుక్కున్నారు.. చంపుకున్నారు.. చాలా గొడవలే జరిగాయి. ఇలా కొన్నాళ్లవరకు మారణకాండ జరిగిన అనంతరం తిరిగి ప్రశాంతవాతావరణం ఏర్పడింది. అయితే తాజాగా ఇప్పుడు హత్యకేసుకు సంబంధించి రకరకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పరిటాల రవి హత్యకు ప్రధాన నిందితుడు వైఎస్ జగన్ అని టీడీపీ పార్టీ కార్యకర్తలు ఆరోపణలు చేయగా... ఈ హత్య విషయంలో బాబు కూడా కీలకపాత్ర వహించాడంటూ జగన్ వ్యాఖ్యానాలు గుప్పిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో హత్యారాజకీయాలమీద చర్చలు మొదలైన నేపథ్యంలో... ఎంతోమంది మంత్రుల హత్యలకు సంబంధించి అధికార, ప్రత్యర్థ పార్టీలు వాదోపవాదనలు వినిపిస్తున్నారు. అయితే పరిటాల రవి హత్యకేసు సంబంధించి అసెంబ్లీలో చర్చలు చాలా దుమారాన్నే రేపుతున్నాయి. నిన్నటికి నిన్న.. పరిటాల రవిని హత్య చేసింది వైకాపా అధ్యక్షుడు జగన్ అంటూ టీడీపీ మంత్రి ఆరోపణలు చేయగా... అందుకు జగన్ ధీటుగానే జవాబులు ఇచ్చారు. తాజాగా ఆయన ఈ కేసుకు సంబంధించి ఓ సరికొత్త వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. ‘‘పరిటాల రవి హత్య విషయంలో వున్న నిజానిజాలన్ని చంద్రబాబు నాయుడికి పూర్తి తెలుసునని.. అయినా ఏమి తెలియకుండా నటిస్తున్నాడని పేర్కొన్న ఆయన... ఆ కేసులో ప్రధాన నిందితులుగా పరిగణించబడిన జేసీ బ్రదర్స్ ను బాబు టీడీపీలో ఎందుకు చేర్చుకున్నారు’’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదట్లో జగన్ మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీలో ఏం జరుగుతోంది రాష్ట్రం మొత్తం చూస్తోంది. అసెంబ్లీ ప్రారంభం అవడానికి ముందు 11 మంది వైసీపీ కార్యకర్తలు చనిపోయారు. ప్రారంభమైన తర్వాత మరో ఇద్దరు.. శుక్రవారం ఉదయం మరొకరు చనిపోయారు. ఇప్పటికే మొత్తం 14 మంది వైసీపీ వర్గీయులు టీడీపీ కార్యకర్తల దాడిలో చనిపోయారు’’ అని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘చర్చను తప్పుదోవ పట్టించేందుకే పరిటాల రవి హత్యను చర్చలోనే ప్రస్తావిస్తున్నారు. పరిటాల కేసులో కోర్టు ఇప్పటికే తీర్పునిచ్చింది. అందులో దోషులుగా తేలినవారికి శిక్ష కూడా పడింది. అంతెందుకు.. చంద్రబాబుకు పరిటాల రవి హత్య విషయంలో వున్న రహస్యాలు, నిజానిజాలన్ని తెలుసు. అందుకే జేసీ బ్రదర్స్ ను టీడీపీలోకి చేర్చుకున్నారు’’ అని పేర్కొన్నారు. ‘‘దీనిని బట్టి చూస్తుంటే.. పరిటాల రవి హత్యకేసులో బాబు కూడా ప్రధాన నిందితుడే’’నంటూ ఆయన విమర్శలు చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more