Paritala ravi murder case to reopen jagan prosecution pattipati pullarao

Paritala Ravi murder case, Paritala sunitha, Pattipati Pulla rao, Jagan in Paritala Rav case

Jagan may not know that Paritala Ravi's murder case will be reopened - Pattipati Pullarao

పరిటాల కేసు రీ-ఓపెన్: పత్తిపాటి

Posted: 08/24/2014 11:02 AM IST
Paritala ravi murder case to reopen jagan prosecution pattipati pullarao

దివంగత నేత పరిటాల రవి హత్యోదంతంపై పునర్విచారణ జరిపే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు శనివారం అన్నారు. గుంటూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో విలేఖరులతో మాట్లాడారు.

పరిటాల రవి హత్యకేసులో ఎవరిని అడిగినా జగన్‌ పాత్ర గురించి చెప్తారని మంత్రి అన్నారు.పరిటాల రవి హత్యకేసుపై పునర్‌విచారణ చేయాలని టిడిపి కార్యకర్తలు కోరుతున్నట్లు సునీత తెలిపారు. అసెంబ్లీలో దౌర్జన్యాలు చేయాలనుకోవడం మంచి పద్దతి కాదని జగన్‌కు సునీత సూచించారు. జగన్ సభలో ఇలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

పత్తిపాటి,వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టమన్నారు. శాంతిభద్రతలపై వాస్తవాలను వినలేక జగన్ అండ్ కో సభ నుంచి పారిపోయారన్నారు. వాస్తవానికి జగన్‌కు జైలు - అసెంబ్లీలకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ప్రజలందరి మనోభావాలను అద్దంపట్టే శాసనసభ దేవాలయం లాంటిదన్నారు. సభలో చర్చ జరిగితే తమ నేరిచరిత్ర అంతా బయటకు వస్తుందనే భయంతోనే ఆయన వాకౌట్‌చేసి పారిపోయారన్నారు. అసలు శాంతిభద్రతలపై మాట్లాడే అర్హత, నైతికత జగన్‌కు లేదన్నారు. రుణమాఫీ ప్రక్రియను రెండునెలల్లోగా పూర్తిచేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటోందని పుల్లారావు పేర్కొన్నారు. బడ్జెట్‌లో 5వేల కోట్లరూపాయలు మాత్రమే కేటాయించినప్పటికీ సర్కారుకు వివిధ కీలకశాఖల ద్వారా వచ్చే ఆదాయాన్ని సెక్యూరిటైజ్ చేయడం ద్వారా నిధులను సేకరిస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paritala Ravi case  Paritala Sunitha  YS Jagan  Pattipati Pullarao  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more