(Image source from: Small producers council president natti kumar accused on tdp party ministers)
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా సరిగ్గా మూడునెలలైనా అవలేదు.. అప్పుడే ఆ పార్టీ మంత్రులు అవినీతిబాటలో పయనిస్తున్నట్టు వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఒకవైపు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాష్ట్రాన్ని కొత్తగా నిర్మించాలి.. అవినీతిని పూర్తిగా అంతమొందించాలని పిలుపునిస్తుంటే.. ఆయన మంత్రులు, సహచరులందరూ మాత్రం లోలోపలే అవినీతికి తెరతీస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు.. చిన్న నిర్మాతల మండలి అధ్యక్షుడు నట్టి కుమార్! అనుకోకుండా ఈయన దృష్టి సినిమాల మీద నుంచి రాజకీయాలవైపు ఎలా మళ్లిందో తెలియదు కానీ.. ఆయన మాత్రం ఈ విధంగా సంచలన వ్యాఖ్యలు చేసి కొత్త వివాదానికి తెరతీసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లోని ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ పార్టీకి చెందిన ఒక మంత్రి, అతని సహచరులు కొంతమంది కలిసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. 2006-12 వరకు సర్వీసు ట్యాక్స్ మొత్తాన్ని మాఫీ చేయిస్తామంటూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వెల్లడించారు. ఒక్కొక్క థియేటర్ యజమాని వద్ద నుంచి సుమారు రూ.50వేల చొప్పున వసూలు చేశారని ఆయన ఆరోపణలు చేశారు. టీడీపీ మంత్రి, ఆయన అనుచరుడు అశోక్‌కుమార్ ఇద్దరూ గోవిందరాజు అనే మధ్యవర్తితో కలిసి ఇప్పటికే దాదాపు 12 కోట్ల రూపాయల వరకు డబ్బులు వసూలు చేసినట్లు ఆయన స్పష్టం చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. కేవలం మంత్రి అనుచరులే కాకుండా ఎన్వీ ప్రసాద్, పూర్వీ రాజు, చిన్ని, జనార్థన్, అలంకార్ ప్రసాద్‌లకు కూడా ఈ వసూళ్లలో భాగముందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా సరిగ్గా మూడునెలలైనా కాలేదు కానీ.. ఆ పార్టీకి చెందిన మంత్రి ఒకరు అప్పుడు అక్రమాలకు ఒడిగట్టడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఆయన తెలిపారు. ఒకవైపు చంద్రబాబు అభివృద్ధిబాటలో అడుగులు వేస్తుండగా.. ఆయన మంత్రులు మాత్రం ఇలా వ్యవహరించడం చాలా దురదృష్టకరమని పేర్కొన్న ఆయన.. అటువంటి మంత్రులను, వారి అనుచరులను 24 గంటల్లోగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more