కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్ట వేగంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. సీఎం కేసీఆర్, ఆయన కేబినెట్ కొత్త రాష్ర్టాన్ని తీర్చిదిద్దేందుకు అహర్నిశలూ కష్టపడుతున్నారు. విదేశీ పర్యటనలు చేసి అలసిపోతున్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రస్థానంలో ఉంచాలనుకుని భావిస్తున్నారు. అభివృద్ధి మాట దేవుడెరుగు కాని.., క్రిమినల్ మంత్రుల జాబితాలో మాత్రం తెలంగాణే టాప్ ప్లేస్ లో ఉంది. దాదాపు అందరు తెలంగాణ మంత్రులపై కేసలున్నాయి. వీరిలో 90శాతం మంత్రులపై క్రిమినల్ కేసులుండటం విశేషం.
‘ది అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్’ అనే సంస్థ దేశంలో క్రిమినల్ కేసులు ఉన్న నేతల వివరాలను విడుదల చేసింది. గత రెండేళ్ళలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, వారిపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు ఇందులో ఉన్నాయి. ఈ లిస్ట్ ప్రకారం తెలంగాణలో అత్యదికంగా 90శాతం మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు చెప్పింది. ఆ తర్వాత మరో తెలుగు రాష్ర్టం ఆంద్రప్రదేశ్ 56శాతం మంత్రులపై క్రిమినల్ కేసులతో రెండవ స్థానంలో ఉంది. 34శాతంతో కర్ణాటక, 27శాతంతో ఒడిశా రాష్ర్టం తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ మంత్రుల సారధులు కేసీఆర్, చంద్రబాబులపై కూడా క్రిమినల్ కేసులున్నాయని సంస్థ స్పష్టం చేసింది.
అయితే మిజోరం, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్ రాష్ర్టాల్లో ఒక్క మంత్రిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు కాకపోవటం విశేషమని ఏడిఆర్ వెల్లడించింది. ప్రజల కోసం ఎంతో శ్రమించే సమయంలో కొన్ని కోర్టు చిక్కులు. కేసులు తప్పవని.., ప్రజా జీవితంలో ఇవన్నీ సాధారణమని ఈ లిస్ట్ లో పేరున్న పలువురు నేతలంటున్నారు. అయితే కేసులు సరే కాని.., క్రిమినల్ కేసుల సంగతి ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. తమ కోసం ఏం నేరం చేశారో చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more