(Image source from: tdp mla Talasali srinivas yadav to may join trs party)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని దక్కించికున్నప్పటికీ... తెలంగాణాలో మాత్రం పట్టువీడుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ చాలా తక్కువ సీట్లతో ఓడిపోవడమే గాక.. ఇప్పుడు గెలిచిన అభ్యర్థులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. తమతమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలంటే అధికారంలో వున్న పార్టీలోకి జంప్ అవ్వాల్సిందేననంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వరుసగా వలసలు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రాజీనామా చేయగా... తాజాగా మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా వున్నట్టు సమాచారం!
తాజా సమాచారం ప్రకారం... సనత్ నగర్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారనున్నట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయం 10 గంటలకు తలసాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం కానున్నారు. దీంతో ఇప్పుడిది రాజకీయరంగంలో చర్చనీయాంశంగా మారిపోయింది. తలసాని టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం కోసమే కేసీఆర్ తో కలుస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కూడా ఈయన పార్టీ మారనున్నట్టు ఎన్నో ఊహాగానాలు, వార్తలు తెగ షికార్లు చేశాయి. ఆయన టీడీపీ పార్టీకి దూరంగా వుండటం.. పార్టీ నేతలతో ఎక్కువ కలవకపోవడంతో ఆయన పార్టీ వీడనున్నట్టు అప్పట్లో వచ్చిన వార్తలకు ఊపిరి పోసినట్లయ్యింది. అయితే ఈసారి ఆయన కేసీఆర్ తో భేటీ కావడాన్ని చూస్తుంటే.. ఆయన పార్టీ మారడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే.. హైదరాబాద్ లోని పద్మారావునగర్ డివిజన్ లో ఐడీహెచ్ కాలనీలోని శిథిలావస్థకు చేరిన ఇళ్లు ప్రస్తుత భారీ వర్షాలకు కూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తలసాని, సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. దీంతో వీరి కలయికపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు.. తలసాని పార్టీ మారనున్నట్టు పేర్కొంటుండగా, టీడీపీ నేతలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకే ఆయన కలుస్తున్నారని, శిథిలావస్థకు చేరిన ఇళ్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరనున్నట్టు వారు స్పష్టం చేస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more