(Image source from: telangana journalists dharna in front of kcr house in delhi)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని.. వెంటనే ఆయన తన వైఖరిని మార్చుకోవాలంటూ తెలంగాణ జర్నలిస్టులందరూ ఆయన ఇంటిముందు పెద్దఎత్తున ధర్నాకు దిగారు. తెలంగాణ శాసనసభ్యులను కించపరిచేవిధంగా, వ్యంగ్యంగా టీవీ9, ఏబీఎణ్ ఆంధ్రజ్యోతి ప్రసారాలు చేశాయన్న ఆగ్రహంతో సదరు ఛానెళ్ల కేసీఆర్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే! కేసీఆర్ అసెంబ్లీలో ఆయా ఛానెళ్లమీద ఆగ్రహం వ్యక్తం చేసిన మరుక్షణమే ఆ ఛానెళ్లు క్షమాపణలు కోరినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. ఎలాగైనా వాటిపై ఆంక్షలు విధించేతీరుతామని ఆయన ప్రకటించిన నేపథ్యంలో ఆ ఛానెళ్ల ప్రసారాలు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా నిలిచిపోయాయి.
ఇదిలావుండగా.. తెలంగాన ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరిస్తోందని.. ఈ స్వేచ్ఛకు సంకెళ్లు వేయవద్దని ఇప్పటికే చాలాసార్లు ఆందోళనలు చేసినప్పటికీ కేసీఆర్ ఆ విషయంలో ఇప్పటివరకు నోరు విప్పలేదు. తాజాగా మరోసారి తెలంగాణ జర్నలిస్టులందరూ కలిసి మరోసారి కేసీఆర్ ఇంటిముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో బిజీగా వున్న కేసీఆర్.. అక్కడ ఆయన నివాసం వద్దకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన జర్నలిస్టులు ధర్నా చేస్తున్నారు. తమ మూతికి నల్లని వస్త్రాలు కట్టుకుని నిరసనలు చేపట్టారు. ఛానెళ్ల ప్రసారాలను వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు భారీగా మోహరించారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more