Telangana cm kcr says no to new districts

CM Kcr, New districts, constituencies, Bifurcation

CM kcr says will finalize on new districts after constituencies bifurcation

మా దశాబ్దాల ఉద్యమాలు మీకు కనబడవా..?

Posted: 09/13/2014 08:14 AM IST
Telangana cm kcr says no to new districts

జిల్లాల పునర్ విభజన ఎప్పుడెప్పుడు చేపడతారా..? అని ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరాశనే మిగిల్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీని స్థాపించి, పద్నాలుగు ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్.. తమ ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా మార్చాలంటూ అంతకు పూర్వం నుంచి సాగుతున్న ఉద్యమాలను తేలిగ్గా తీసుకోవడంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో తమకు హామీనిచ్చిన పార్టీ.. అధికారంలోకి వచ్చినా జిల్లాల పునర్విభజనపై ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడాన్ని వారు తప్పుబడుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాతే.. ఆదనపు జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ తాజా ప్రకటనపై వారు మండిపడుతున్నారు. ఎన్నికలకు మందు ఓ మాట, తరువాత మరో మాట అంటూ నిట్టూరుస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.

మెదక్ జిల్లాలోని సిద్దిపేటను జిల్లా కేంద్రంగా మార్చాలంటూ దాదాపు మూడు దశాబ్దాలుగా స్థానికులు ఉద్యమిస్తున్నారు. జిల్లా కేంద్రం సంగారెడ్డికి ఏదైనా వ్యవహారంపై వెళ్లాలంటే సుమారు 150 కిలోమీటర్ల మేరు వారు ప్రయాణం సాగించాల్సిందే. ఇక రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల ప్రజలు కూడా వికారాబాద్ ను జిల్లా కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలన్న ఢిమాండ్ లు కొన్ని ప్రాంతాల్లో ముందునుంచి వస్తుండగా, మరి కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నేతల హామీలతో ఈ డిమాండ్లు పుట్టుకోచ్చాయి.

అదనపు జిల్లా కేంద్రాల ఏర్పాటులో ఇంకా సమయం ఉందని చెబుతున్న సీఎం కేసీఆర్.. ప్రజాగ్రహం పెల్లుబిక్కక ముందే వాటిని ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో తమ ప్రభుత్వం ఎంత చేసినా.. ప్రజల విమర్శలకు లోను కావాల్సి వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM Kcr  New districts  constituencies  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more