Paritala sunita says ap government plans to survey on ration cards

paritala sunita, paritala ravi, paritala sriram, paritala, faction, anantapuram, andhrapradesh, andhrapradesh government, chandrababu naidu, ap cabinet, ap ministers, samagra kutumba survey, survey latest news, ration cards, aadhar cards

andhrapradesh government plans to do survey for removing bogus ration cards with a new project named e-pass : ap minister paritala sunita says government plans to conduct bogus ration cards removing project from eastgodawari district

ఏపీలోనూ సర్వేకు సిద్దమవుతున్న సర్కారు

Posted: 09/15/2014 12:07 PM IST
Paritala sunita says ap government plans to survey on ration cards

ఏపీలో సర్వే చేసేందుకు టీడీపీ ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. గత నెలలో ఎవరు వద్దన్నా.., కాదన్నా.. కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర సర్వే చేసి తీరింది. అన్ని పార్టీలతో పాటుగా టీడీపీ కూడా నాటి సర్వేను వ్యతిరేకించింది. అయితే ఇప్పుడు మాత్రం సర్వేకు సిద్ధం అవుతోంది ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ సర్కారు. త్వరలోనే సర్వే చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే ఇది మాత్రం తెలంగాణ ప్రభుత్వ సర్వేలా ఒకే రోజు సర్వే కాదు.., అదేవిధంగ సమగ్ర సర్వే కాదు. కేవలం రేషన్ కార్డుల సర్వే. బోగస్ రేషన్ కార్డులను ఎత్తేసేందుకు సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి పరిటాల సునీత ఈ విషయాన్ని వెల్లడించారు.

జిల్లాల వారిగా సర్వే చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. ముందుగా తూర్పుగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా సర్వే అమలు చేస్తామని చెప్పారు. అటు ఇకపై అవకతవకలు జరగకుండా ప్రత్యేకంగా ఈ-పాస్ ద్వారా సర్వే చేసి అందరి వివరాలు వెబ్ సైట్ లో నమోదు చేస్తారని చెప్పారు. గతంలో ఉమ్మడి రాష్ర్టంలో విద్యార్థుల స్కాలర్ షిప్ ల జారీ కోసం కిరణ్ సర్కారు ఈ-పాస్ తీసుకువచ్చింది. దీని తరహాలోనే అందరి వివరాలను కంప్యూటరీకరణ చేసి ఒకే సర్వర్లో ఉంచుతారు. ఫలితంగా బోగస్ కార్డుల ఏరివేత సులభం అవుతుంది. సర్వే వల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడవచ్చని మంత్రి సునీత అంటున్నారు. ఈ సర్వే కూడా తెలంగాణ సర్కారు సర్వేలా వివాదాలకు కారణం అవుతుందా లేక సాఫీగా సాగుతుందా చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : survey  ration cards  paritala sunita latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more