(Image source from: chandrababu naidu revealed his and family members assets in latest press meet)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు మరోసారి మీడియా సమావేశంలో తన, తన కుటుంబ ఆస్తులను ప్రకటించారు. గతంలో బాబు బ్లాక్ మనీ బాగానే దండుకున్నారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన తన ఆస్తులను అప్పుడు ప్రకటించిన విషయం విదితమే! అయితే ఈసారి అలాంటి ఆరోపణలు ఏమీ రాకముందే బాబు తన ఆస్తులను నాలుగోసారి ప్రకటించారు. ఎథిక్స్ కమిటీకి తన, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు సమర్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక హెరిటేజ్ విషయానికి వస్తే.. కుటుంబ జీవనానికి ఏదో ఒక ఆధారం వుండాలనే దానిని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
గతేడాదితో పోల్చుకుంటే ఈసారి తమ బ్యాంక్ బ్యాలెన్స్ కొంచెం పెరిగిందని బాబు వెల్లడించారు. అలాగే తన భార్య పేరిట వున్న ప్రావిడంట్ ఫండ్, బంగారం కూడా పెరిగాయని తెలిపారు. నిర్వహణ హోల్డింగ్స్ ఆస్తులు రూ.90 లక్షలు పెరిగాయని తెలిపారు. ఇక తమ వ్యక్తిగత ఆస్తులను ప్రకటిస్తూ.. తన పేరిట రూ.70.69 కోట్లు, భార్య భువనేశ్వరి పేరిట రూ.46.88 కోట్లు, కుమారుడు లోకేష్ పేరిట రూ.11.04 కోట్లు, కోడలు బ్రహ్మణి పేరిట రూ.5.32 కోట్లు వున్నట్లు ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో తన కుటుంబసభ్యులు ఎవరికి వారే తమ ఆస్తులను ప్రకటిస్తారని ఆయన స్పష్టం చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more