ఐదు రోజుల అమెరికా పర్యటనలో వున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఇవాళ 9/11 మృతులకు నివాళులు అర్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. గ్రౌండ్ జీరోను సందర్శించి మృతులకు అంజలి ఘటించారు. స్మారక స్థూపాల వద్ద మోడీ పుష్పగుచ్చాలు ఉంచి అమరులకు శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం ఆయన 9/11 మ్యూజియంను సందర్శించారు. అల్ ఖైదా మిలిటెంట్లు 2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై జరిగిన దాడిలో దాదాపు మూడువేల మంది మరణించడంతో.. ఆ ప్రదేశాన్ని గ్రౌండ్ జీరో పేరుతో మృతుల స్మారక ప్రదేశంగా అక్కడి అధికార యంత్రాంగం మార్చింది. ఈ ప్రదేశాన్ని సందర్శించిన మోడీ.. ఈ ఘటన సన్నివేశాలను చూసి కళ్లను చమర్చారు.
అనంతరం ఆయన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ను కలుసుకున్నారు. కాశ్మీర్ పై పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ఉగ్రవాదంప పోరు తదితర అంశాలకు సంబంధించి బాన్ కీ మూన్ తో చర్చించారు. అంతకుముందు ఆయన అమెరికన్ భారతీయులకు ధన్యవాదాలు తెలిపారు. తన రాక కోసం నిరీక్షిస్తూ.. పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలోనూ తనకు ఇంతటి అభిమానులు వున్నారని తాను ఊహించలేదన్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more