ఎన్నడూలేని విధంగా చాలా సంవత్సరాల తర్వాత ‘‘హుధుద్’’ తుపాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసింది. ఇప్పటికే విభజన దెబ్బతో కోలుకోలేకపోతున్న ఏపీ.. ఇప్పుడు ఈ తుపాను దెబ్బతో ఆ రాష్ట్రానికి ఐటీ హబ్ గా వుండే విశాఖ, పర్యాటక కేంద్రంగా వుండే అరకు, ఇంకా ఇతర తీరప్రాంతాలు కకావికులైపోయి తీవ్రనష్టం వాటిల్లింది. ముఖ్యంగా తీరప్రాంతాల్లో వుండే ఉత్తరాంధ్రజిల్లాలో అధిక మొత్తంలో ఆస్తినష్టం జరిగింది. ఆ తుపాను కారణంగా సంభవించిన మొత్తం నష్టం వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేసింది.
తుపాను కారణంగా మొత్తం 26మంది మరణించగా, 146 మందిని సహాయకబృందాలు కాపాడినట్లు ప్రభుత్వం తెలిపింది. దాదాపు 7806 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, 219 చోట్ల రోడ్లు - రైలుపట్టాలు బాగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. అలాగే మొత్తం 8301 కరెంటు స్తంభాలు కూలిపోగా.. 19 చోట్ల కాల్వలకు గండ్లు పడ్డాయి. 181 బోట్లు గల్లంతయ్యాయి. 3368 పశువులు మృత్యువాతపడ్డాయి. తుపాను ప్రభావం మొత్తం 2 కోట్ల మందిపై పడిందని, వారందరికీ కావాల్సిన సదుపాయాలను అందచేయడం కోసం 223 రిలీఫ్ క్యాంపులు, 223 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో వివరించారు. తుపాన్ వల్ల జరిగిన దెబ్బతిన్న జిల్లాలను తిరిగి పునరుద్ధరించాలంటే ఎక్కువ సమయంతోపాటు చాలా ఖర్చుచేయాల్సి వుంటుందని తెలుపుతున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more