తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత ఇవాళ మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె విడుదలకు మార్గం సుగమం అయ్యింది. బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు అధికారులు ... జయలలితను విడుదల చేశారు. అంతకు ముందు జయ తరపు న్యాయవాది రూ.2 కోట్లతో కోర్టుకు ష్యూరిటీ సమర్పించారు.
సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. శుక్రవారం రాత్రి జయలలిత జైల్లోనే ఉన్నారు. విడుదల కోసం లాంఛనాలు పూర్తి కాకపోవడంతో ఆమె శనివారం మధ్యాహ్నం వరకు నీరిక్షించాల్సి వచ్చింది. 22 రోజుల తర్వాత జయలలిత బయట వాతావరణాన్ని చూశారు. అమ్మ విడుదలతో అన్నాడీఎంకే కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలు జయలలితకు మద్దతుగా నినాదాలు చేశారు. అత్యంత పటిష్ఠమైన భద్రత మధ్య జైలు నుంచి జయలలిత తన కాన్వాయ్ లో బయల్దేరారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more