New government to form on 28th in maharashtra

Maharastra, BJP, Devendra Fadnavis, Shivsena, october 28, uddav thackarey, PM \narendra modi, Amit shah, nitin gadkari

new government to form on 28th in maharashtra

మహారాష్ట్రలో 28న కోలువుదీరనున్న కోత్త ప్రభుత్వం..?

Posted: 10/25/2014 07:21 PM IST
New government to form on 28th in maharashtra

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపి సిద్ధమైంది. బీజేపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ విద్యాసాగర్ రావును ఇవాళ కలిశారు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో బీజేపి ఉంది.  122 శాసనసభా స్థానాలు గెలుచుకొని బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే 288 స్థానాలు  గల సభలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి  145 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం ఉంది. బీజేపి మిత్రపక్షమైన రాష్ట్రీయ సమాజ్‌పక్ష ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంది.  శివసేన 63, కాంగ్రెస్‌ 42, ఎన్సీపీకి 41 స్థానాలను సాధించాయి.  ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 145 మేజిక్ మార్క్ ను సాధించాలంటే బీజేపికి మరో 22 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సివుంది.

ఈ నేపధ్యంలో తొలుత ఎన్సీపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న బీజేపి మనసు మార్చుకొని శివసేన మద్దతు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శివసేన అడిగిన మంత్రి పదవులు ఇవ్వడానికి కూడా బీజేపి సిద్దపడినట్లు సమాచారం. బీజేపి శాసనసభా పక్షం సోమవారం సమావేశమై ప్రభుత్వం ఏర్పాటుపై ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఈ నెల 28న కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. మొదట అయిదుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more