Court issues non bailable warrant against kanimozhi cancels it after apology

Kanimozhi, DMK, Special court, non-bailable warrant, karunanidhi, arrest, police, Delhi court, Final Hearings, A,Raja, cancel, apology

Court issues non-bailable warrant against Kanimozhi, cancels it after apology

వారెంట్ జారీ. అయ్యాక అరెస్టు తప్పించుకున్న కనిమొళి

Posted: 11/10/2014 03:37 PM IST
Court issues non bailable warrant against kanimozhi cancels it after apology

డీఎంకే రాజ్యసభ సభ్యురాలు, డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళికి స్పెషల్ కోర్టులో చుక్కెదురైంది. కనిమొళిని అరెస్టు చేయాలని పేర్కొంటూ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో అమెను అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారని సమాచారం. 2జీ స్పెక్ట్రమ్ కేసులో నిందితురాలిగా వున్న కనిమొళి.. గతంలో జైలులో రిమాండ్ ఖైదీగా వున్నారు. ఈ నేపథ్యంలో అమెకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. బెయిల్ మంజూరు చేసిన ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగిన సమయానికి కనిమొళి కోర్టుకు హాజరుకాలేదు అమె కానీ అమె తరపున న్యాయవాది కానీ హాజరుకాకపోవడంతో కోర్టు అమెను అరెస్టు చేయాల్సిందిగా ఆదేశిస్తూ.. ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. దాంతో కనిమొళి అరెస్ట్ కు రంగం సిద్ధమవుతోంది అనుకుంటున్న సమయంలో మధ్యాహ్నం 12,30 గంటలకు కోర్టులో కనిమొళి తరపు న్యాయవాది వచ్చారు. న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పడంతో నాన్ బెయిలేబుల్ వారెంటును రద్దు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. భవిష్యత్ లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తాగా వుండాలని న్యాయమూర్తి కనిమొళి తరపు న్యాయవాదికి సూచించారు.. మరోవపు 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో తుది వాదనలు వినడానికి డిసెంబర్ 19 తేదిని ఢిల్లీ కోర్టు ఫిక్స్ చేసింది. ఈ కేసులో మాజీ టెలికాం మంత్రి ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఇతర 15 మందిపై ఆరోపణలెదుర్కొంటున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanimozhi  DMK  Special court  non-bailable warrant  karunanidhi  arrest  police  Delhi court  Final Hearings  A  Raja  cancel  apology  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more