Jayalalitha cannot handle official posts government releases gazette notification

Jayalalithaa, convicted, corruption, announced, Gazette, loss of power, Srirangam constituency, empty, disproportionate assets, special court, Bangalore

jayalalitha cannot handle official posts, government releases gazette notification

పదేళ్ల పాటు అధికార పదవులకు జయలలిత దూరం

Posted: 11/13/2014 09:37 AM IST
Jayalalitha cannot handle official posts government releases gazette notification


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐడీఎంకే అధినేత్రి జయలలితకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కన్నా తన సొంత పార్టీ నేతలే తనను పదవులు అధిరోహించకుండా అడ్డుపడుతూ.. ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఆమెను మరింత కలవరానికి గురిచేస్తుంది. ఇంతకాలం తాను ఏదనుకుంటే అది సాగిన క్రమం పొయి.. ఇకపై తాను ఏదనుకుంటే అది చేయించుకోవాల్సిన పరిస్థితి రావడం. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినా.. పదవులకు పరిమితం కాకుండా కేవలం పార్టీకి మాత్రమే ఆమె పరిమితం కావడం అమెను ఆందోళనకు గురిచేస్తుంది. పార్టీని, ప్రభుత్వాన్ని రెండు చేతులతో నడిపిన జయలలిత ఇకపై కేవలం పార్టీ వ్యవహారాలకు మాత్రమే పరిమితం అవుతోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. అమెకు పదవులు అలకరించే అవకాశం లేకుండా తన ప్రభుత్వమే గెజిట్ విడుదల చేయడం ఇందుకు కారణం

జయలలితను పదేళ్లపాటు ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హురాలని తమిళనాడు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. తమిళనాడు అసెంబ్లీ సభ్యురాలైన జయలలితకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష పడిన 2014, సెప్టెంబరు 27వ తేదీ నుంచి అనర్హత వర్తిస్తుందని తెలిపింది. జయలలిత ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీరంగం అసెంబ్లీ స్థానాన్ని ఖాళీ అయినట్లుగా పరిగణిస్తామని తెలిపింది. ఈ స్థానం ఖాళీ అయినట్లు ఇంతకుముందే వెల్లడించినా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అధికారికంగా వెల్లడించింది. దీంతో ఇక పదేళ్ల పాటు ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా జయలలిత అనర్హురాలు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more