మాజీకేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవికి వెంటనే తన ఇంటిని ఖాళీ చేయాలంటూ తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. గతంలో కూడా ఇటువంటి నోటీసులే జారీ అయినప్పటికీ వాటిని చిరు బేఖాతరు చేయడంతో ఈసారి కాస్త సీరియస్ గానే మళ్లీ నోటీసులు జారీ చేశారు. మునుపటిలా నిర్లక్ష్యం చేయకుండా తన నివాసాన్ని ఖాళీ చేయాల్సిందేనని అధికారులు పట్టుమీద వున్నారని సమాచారం! అయితే ఇక్కడ చిరుని ఖాళీ చేయమంటోంది ఆయన సొంత నివాసాన్ని కాదులెండి... యూపీఏ-2 ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా వున్నప్పుడు ఆయనకు ప్రత్యేకంగా కేటాయించిన ఇంటిని ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు చిరంజీవి కొన్నాళ్లపాటు కేంద్రటూరిజం శాఖమంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే! ఆ సమయంలో ఆయనకు ప్రత్యేకంగా ఒక ఇంటిని కేటాయించారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరంగా పరాజయం కావడం వల్ల ఆ పార్టీ తుడిచిపోవడంతోపాటు మంత్రలందరూ తమ పదవులను కోల్పోయారు. అలాగే చిరు కూడా తన పదవిని కోల్పోయారు. అయితే యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా ప్రభుత్వ సౌకర్యాలను అనుభవించిన చిరంజీవి, యూపీఏ గద్దెదిగినప్పటికీ ఆ ఇంటిని ఇంతవరు ఖాళీచేయలేదు. నిజానికి 2014 మే 30తోనే ఆయన అధికారిక నివాసం గడువు ముగిసింది.. కానీ ఆయన మాత్రం ఖాళీ చేయలేదు.
దీంతో చిరంజీవి తన అధికారిక నివాసాన్ని తక్షణమే ఖాళీ చేయాలంటూ ఎస్టేట్ డైరెక్టరేట్ అధికారులు అక్బర్ రోడ్డులోని 17వ నెంబరు ఇంటికి నోటీసులు అంటించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి ఇదే నివాసంలో కొనసాగాలని భావించినప్పటికీ, మంత్రులకు కేటాయించాల్సిన ఈ క్వార్టర్‌ను ఎంపీకి కేటాయించలేమని అధికారులు తేల్చిచెప్పారు. ఆ దెబ్బతో ఆయనకు ఆ ఇంటిని ఖాళీ చేయడం తప్ప మరోమార్గం లేదు. జూన్ 27వ తేదీ నాటికే గడువు ముగిసిందని గతంలోనే అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పటికీ ఖాళీ చేయకపోవడంతో తక్షణం ఖాళీ చేయాలంటూ ఆ ఇంటికి నోటీసులు అంటించారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more