Hyderabad police arrest nri rajababu of vijayawada

rajababu kidnap case, nri rajababu kidnap, rajababu kidnap twist and suspense mystery, vijayawada nri rajababu, nri arrest and special rights, hyderabad police, real estate in vijaywada, latest news updates, hyderabad police latest, hyderabad real estate

hyderabad police arrest nri rajababu of vijayawada : vijayawada based nri rajababu kidnap matter come to end with hyderbad police clarification that they had arrests him in cheating case. no kidnap in nri rajababu issue, afzal gunj police arrested rajababu in vijayawada for cheating with real estate busines

దొంగను కిడ్నాప్ చేసిన పోలిసులు

Posted: 11/18/2014 09:55 AM IST
Hyderabad police arrest nri rajababu of vijayawada

ఎన్నారై రాజాబాబు అరెస్టు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆయన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదనీ.. పోలిసులే అరెస్టు చేశారని తెలుస్తోంది. విజయవాడకు చెందిన రాజాబాబును రియల్ ఎస్టేట్ మాఫియా కిడ్నాప్ చేసిందని సోమవారం రోజు వార్తలు వచ్చాయి. విజయవాడ సమీపంలో భూమి కలిగి ఉన్న ఎన్నారై రాజాబాబు, అమ్మేందుకు నిరాకరించటంతోనే రియల్ మాఫియా కిడ్నాప్ చేసి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా విజయవాడలో కలకలం రేగింది. భూముల యజమానులు భయపడ్డారు.

ఆ తర్వాత హైదరాబాద్ పోలిసులు మీడియా ద్వారా అసలు విషయం బయటకు వెల్లడించారు. రాజాబాబును హైదరాబాద్ లోని అఫ్జల్ గంజ్ పోలిసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పేరిట చాలామందిని మోసం చేశాడని ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. దాదాపు రూ.30 లక్షల వరకు ప్రజల నుంచి వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ మోసంపై అఫ్జల్ గంజ్ పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు కావటంతో స్పందించిన పోలిసులు ప్రత్యేకబృందంతో విజయవాడకు వెళ్ళి నిందితుడిని అరెస్టు చేసి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే చెప్పకుండా తీసుకురావటంతో కిడ్నాప్ చేసినట్లుగా అంతా భావించారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad police  vijayawada  nri rajababu  kidnap  arrest  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more