Ap cabinet proposes reenquiry liquor scam accused botsa satyanarayana

botsa satyanarayana in liqour scam, botsa satyanarayana scams, botsa satyanarayana latest updates, andhra pradesh liquor scam accused persons, liquor scam latest updates, liquor syndicates scam, latest telugu news updates, scams in andhra pradesh, palle raghunath reddy updates

ap cabinet proposes reenquiry liquor scam accused botsa satyanarayana : andhra pradesh minister palle raghunath reddy says government may proposed to re-enquiry liquor scam to bring more persons involved in the scam, raghunath reddy alleges that botsa sathyanarayana and others involved in liquor scam

బొత్స పేరును బజారుకు ఈడుస్తున్న లిక్కర్ స్కాం

Posted: 12/16/2014 08:59 PM IST
Ap cabinet proposes reenquiry liquor scam accused botsa satyanarayana

మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ర్ట పీసీసీ చీప్ బొత్స సత్యనారాయణపై చాలా స్కాముల ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ చివరి సమయంలో బయటపడ్డ.., మద్యం సిండికేటు స్కాములోనూ బొత్సపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయన అనుచరులు, కుటుంబీకులు స్వయంగా స్కాములో పాత్రధారులుగా ఉన్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభుత్వంలో బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉండి ఇలాంటి చర్యలేమిటని ప్రతిపక్షాలు నిలదీశాయి. ఇప్పుడిదే అంశం ఆయన్ను మళ్ళీ బజారుకీడుస్తోంది.

బొత్స సత్యనారాయణకు మద్యం సిండికేట్ల కేసులో ప్రమేయం ఉందని ఏపీ మంత్రి పల్లె రఘునాద్ రెడ్డి తెలిపారు. ఈ స్కాములో బొత్స సహా మిగిలిన వారిందర్నీ బయటకు లాగుతామన్నారు. అవసరమైతే కేసుపై పునర్విచారణ, దర్యాప్తు కోసం కేబినెట్ కు సిఫార్సు చేస్తామని కూడా పల్లె చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కాములన్నిటిపై ధర్యాప్తు చేయిస్తామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలకు నేరుగా ప్రమేయం ఉందన్నారు. వేల టన్నుల ఎర్రచందనం ప్రభుత్వ నేతల సాక్షిగా విదేశాలకు ఎగుమతి అయిందని ఆరోపించారు.

అటు వాన్ పిక్, లేపాక్షి భూముల విషయంతో పాటు.., ప్రతి అంశంలో, నిర్ణయంలో ఏదో ఒక లోపం ఉండేదని మండిపడ్డారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజల కంటే కాంగ్రెస్ నేతలకే ఎక్కువ లబ్ది కలిగిందని ఆయన ద్వజమెత్తారు. స్కాములపై న్యాయ సలహా తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో అంటే అధికారంలో ఉండటంతో స్కాముల ఆరోపణలు చెరిగిపోయాయి. ఇప్పుడు కేంద్రంలో ప్రతిపక్షంగా కూడా లేదు., ఇక ఏపీలో అయితే పార్టీకి కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. ఈ పరిస్థితుల్లో పునర్ విచారణ జరిగితే బొత్సకు ఇబ్బందులు తప్పేలా కన్పించటం లేదు.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : liquor scam enquiry  botsa satyanarayana latest  ap government updates  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more