దేశ చరిత్రకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం, అనుమానాస్పద మరణం వివాదం కొత్త మలుపు తిరిగింది. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయినట్లు కొందరు చెప్తుండగా.., లేదని మరికొందరు అన్నారు. అంతేకాకుండా ఆయన విదేశాల్లో ఉన్నారని, భారత్ లోనే చివరివరకూ ఉన్నారని పలు ప్రచారాలు జరిగాయి. ఈ వివాదాలు ఇలా ఉండగానే నేతాజి ఇప్పటికీ బ్రతికే ఉన్నారంటూ కొత్త అంశం తెరపైకి వచ్చి సంచలనం కల్గిస్తోంది.
నేతాజి ఇప్పటికీ బ్రతికే ఉన్నారంటూ రమేష్ కుమార్ అనే న్యాయవాది చెప్తున్నాడు. అంతేకాదు కోర్టు అనుమతిస్తే హాజరుపర్చేందుకు కూడా సిద్దమంటూ ఓ పిటిషన్ ను దాఖలు చేశారు. బోస్ బ్రతికే ఉన్నారనేందుకు ఆధారంగా ఓ ఫొటోను కూడా కోర్డుకు సమర్పించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడి ఆనవాళ్ళను మరిన్ని చూపేందుకు కూడా తాము సిద్ధమని కోర్టుకు ప్రకటించాడు. అటు భారతీయ సుభాష్ సేన నేతాజి బ్రతికే ఉన్నారన్న విషయం స్పష్టంగా చెప్పకపోయినా.., విమాన ప్రమాదంలో మాత్రం ఆయన చనిపోలేదని చెప్తోంది. 1962 చైనా యుద్ధంలో, 1964 నెహ్రూ అంతిమయాత్రలో బోస్ పాల్గొన్నారని అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ లోని ఓ ఆశ్రమంలో సాధువుగా కూడా ఉన్నారని ఇంటలిజెన్స్ గుర్తించినట్లు చెప్పింది.
నేతాజి నేరస్తుడట !!
దేశ స్వాతంత్య్రం కోసం హింసావాద, అహింసావాద ఉద్యమాలు జరిగాయి. హింసావాద మార్గంలో ‘భారత సైన్యం’ను స్థాపించి సుభాష్ చంద్రబోస్ నాయకత్వం వహించాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ నాజీల సహకారంతో బ్రిటిషర్లపై దాడికి సిద్ధమయ్యాడు. అయితే బోస్ నిర్ణయంపై పలు విమర్శలు వచ్చాయి. అయినా సరే బ్రిటిషర్లపై యుద్దాన్ని ఆపలేదు. అనేక దాడులతో వారిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ సమయంలోనే బోస్ ను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం యుద్ధ నేరస్తుడుగా ప్రకటించింది.
దేశ విముక్తి కోసం పోరాడిన ఒక నేతను నేరస్తుడిగా ప్రకటించటం బాధాకరమైతే... దీన్ని అంగీకరిస్తూ బోస్ బ్రతికుంటే అప్పగిస్తామని భారత్ చెప్పటం సిగ్గుచేటు. అయితే గత కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇదే చెప్పింది. దీంతో ప్రస్తుతం పిటిషన్ దాఖలు చేసిన రమేష్ కుమార్.., కేంద్రం నిర్ణయంపై స్టే విధిస్తేనే బోస్ ను హాజరుపరుస్తామన్నారు. లేకపోతే ఆయన్ను ఆంగ్లేయులకు అప్పగించే అవకాశం ఉందని చెప్పారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్.., వివరణ ఇవ్వాలంటూ కేంద్ర కార్యదర్శికి లేఖ రాశారు. బోస్ బ్రతికే ఉన్నాడన్న ఊహాగానాల నేపథ్యంలో.., కేంద్రం ఎలా స్పందిస్తుంది.., కోర్టు ఏమని తీర్పు ఇస్తుంది అనే ఆసక్తి నెలకొంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more