Vada kurma preparation

masal vada kurma news,masal vada kurma photos,masal vada kurma pictures, bollywood news, bollywood pictures, indian news, india news, desi news

Take A Pan And Heat With 2 Tbsp Of Oil Fry Onions And Green Chillies Together In Oil Then Make A Paste With Fried Onions Green Chillies Ginger And Garlic Keep Aside

Vaka Kurma.GIF

Posted: 01/31/2012 01:41 PM IST
Vada kurma preparation

Vada_Kurma_Recipe
వడా కుర్మా తయారీ విధానం :
ఆరోగ్యానికి మేలు చేసే పప్పుదినులలో ముఖ్యమైనది మినప పప్పు. దీనితో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇడ్లీ, వడా లాంటివే కాకుండా ఇంకా అనేక రకాల వంటల్లో దీనిని వాడుతాం. దీనిని ఉపయోగించి తయారు చేసే పిండి వంటకమే వడా కుర్మా. దీని తయారీని తెలుసుకుందాం.
వడా కుర్మా తయారు చేయటానికి కావల్సిన పదార్థాలు :Vada-Kurma
మినప పప్పు – రెండు కప్పులు
ఉల్లిపాయ    - ఒకటి
టమాటాలు  - రెండు
కరివేపాకు   - నాలుగు రెబ్బలు
కొత్తి మీరు   - ఒక కట్ట
పసుపు     - చిటికెడు
ఉప్పు, కారం  - తగినంత
బిర్యానీ ఆకులు – రెండు
దాల్చిన చెక్క   - చిన్న ముక్క
లవంగాలు      - రెండు
నూనె           - తగినంత
కొబ్బరి తురుము – అర కప్పు
అల్లం వెల్లుల్లి ముద్ద   - అర చెంచా
తయారు చేసే విధానం  : మినప పప్పును ముందు రోజు నానబెట్టి మర్నాడు మెత్తగా రుబ్బాలి. అందులో ఉప్పు వేసి కలపాలి. తరువాత బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక పిండిని చేత్తో అద్ది వడల్లా వేయాలి. బంగారు వర్ణంలోకి  వచ్చాక దించేయాలి. ఇప్పడు అదే బాణలిలో నాలుగు చెంచాల నూనె ఉంచి వేడి చేసి అందులో బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలియతిప్పి టమాటా ముక్కలు, కరివేపాకు వేసి మూత పెట్టాలి. కొద్ది సేపటికి పసుపు, కారం చేర్చి గరిటెతో తిప్పి కాసిన్ని నీళ్లు పోయాలి. గ్రేవీ దగ్గర అయ్యాక కొబ్బరి తురుము , వడలను పొడిగా చేసి వేయాలి. అప్పడు కుర్మా బాగా దగ్గర అవుతుంది. దాని పై కొత్తి మీర చల్లి దించేస్తే రుచిగా ఉంటుంది. వేడి వేడి వడా కుర్మా ఇడ్లీ, దోసెల్లో తింటే బాగుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sora chepala pulusu
Chowmahalla palace  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles