Sora chepala pulusu

Sora chepa curry.GIF

Posted: 02/01/2012 08:54 PM IST
Sora chepala pulusu

Sora_chepa

సొర చేప చింతకాయల కూర తయారు చేయు విధానం :

కావాల్సిన పదార్థాలు : సొర చేప ముక్కలు – ఒక కప్పు, చింతకాయలు – ఆరు , ఉల్లిపాయలు – పెద్దవి నాలుగు, పచ్చిమిర్చి – ఆరు, టమాటాలు – రెండు, కొత్తి మీర – కట్ట, ఉప్పు – రుచికి తగినంత, కారం – నాలుగు చెంచాలు, గరం మసాలా – ఒకటిన్నర చెంచా, పసుపు – అరచెంచా , నూనె – పావు కప్పు.

 

తయారీ విధానం : చింతకాయల్నీ నిలువుగా తరిగి లోపల గింజల తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. సొర చేప ముక్కల్ని శుభ్రం చేసుకొని ఉప్సు, కారం, మసాలా సగం చొప్పున, పసుపు వేసుకొని ఇవన్నీ వాటికి కలిపి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేయించాలి. అందులోనే మరికాస్త ఉప్పు, మిగిలిన కారం, గరం మసాలా, ఆ తరువాత చింతకాయ, చేప ముక్కలు చేర్చాలి. ఇవన్నీ బాగా వేగాక కాసిన్ని నీళ్ళు చేర్చి మూత పెట్టాలి. కూర ముక్కలు దగ్గరగా అయ్యాక కొత్తి మీర వేసి దింపేయాలి. సొర చింతకాయల ముక్కల కూర సిద్దం. ఇది రొట్టెల్లొకి బాగుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ingapore city tourism and travel information
Vada kurma preparation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles