అగ్రగామి కార్ల సంస్థ మారుతి సుజుకీ ఉత్ప త్తి కేంద్రంలో చెలరేగిన హింసాకాండ పారిశ్రామిక రంగం లో పెను సంచలనమే సృష్టిస్తోంది. మనేసర్ ప్లాంట్‌లో జరిగిన హింసాకాండలో హెచ్ఆర్ జిఎం అవినాష్ కుమార్ దేవ్ మరణించగా అనేక మంది ఎగ్జిక్యూటివ్‌లు గాయపడ్డారు. కార్మికులు, యాజమాన్య ఉద్యోగులకు మధ్య మొదలైన స్వల్ప ఘర్షణ తీవ్ర రూపం దాల్చి హింసాకాండకు దారితీసింది. కార్మికులు దహనకాండకు పాల్పడ్డారు. ఈ అల్లర్లకు సంబంధించి పోలీసులు 100 మందిని అరెస్టు చేశారు. ప్లాంట్‌లో 1,000 మంది పోలీసులను మొహరించారు.ప్లాంట్‌లో ఉత్పత్తి కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు మారుతి సుజుకీ ప్రకటించిం ది. ఒక సూపర్‌వైజర్‌కు మరో జూనియర్ కార్మికునికి మధ్య చెలరేగిన వివాదం మొత్తం పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. సూపర్‌వైజర్‌గా ఉన్న వ్యక్తి జూనియర్ కార్మికున్ని కులంపేరుతో దూషించడంతో కార్మికులు తిరగబడ్డారని అంటున్నారు. రెచ్చిపోయిన కార్మికులు ఆస్తుల విధ్వంసానికి దిగారు. ప్లాంట్‌లో యంత్రాలను, ముఖ్య విభాగాలను తగలబెట్టారు. ఈ మంటల్లో ఒక ఉద్యోగి సజీవదహనమయ్యారు.
సజీవదహనమైన ఉద్యోగి ఎవరనే అంశంపై ఎలాంటి సమాచారం లేదు. ఆ తర్వాత ఆనవాళ్లను బట్టి మృతుడు హెచ్ఆర్‌జిఎం అవినాష్ కుమార్ దేవ్‌గా గుర్తించారు. మొత్తం 50 మంది కార్మికులపై ఆస్తుల విధ్వంసం, హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారు. మనేసర్ ప్లాంట్ ఘర్షణల్లో 50 మంది గాయపడ్డారని అందులో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. మారుతి సుజుకీ మనేసర్ ప్లాంట్‌లో ఏటా 5.5 లక్షల కార్లు ఉత్పత్తి అవుతాయి. ఇందులో ప్రధానంగా స్విఫ్ట్, డిజైర్, ఎస్టార్ వాహనాలను ఉత్పత్తి చేస్తారు. ఈ ప్లాంటు మూతపడటం వల్ల కంపెనీకి రోజుకు 73 కోట్ల రూపాయల మేర నష్టం ఉంటుందని అంచనా. ఈ హింసాకాండను హర్యానా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. బాధ్యులైన వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని హర్యానా మంత్రి రణదీప్ సింగ్ సుర్జెవాలా హెచ్చరించారు.పారిశ్రామిక వివాదం కాదు.. మనేసర్ ప్లాంట్‌లో చెలరేగిన హింసాకాండ పారిశ్రామిక వివాదానికి సంబంధించింది కాదని మారుతి సుజుకి స్పష్టం చేసింది. గత కొద్ది నెలలుగా మారుతి సుజుకి కుదురుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కొందరు వ్యక్తులు కుట్రపన్ని ఈ సామూహిక విధ్వంసకాండకు పాల్పడినట్టుగా కనిపిస్తోందని మారుతి సుజుకీ పేర్కొంది. ఈ అల్లర్లలో హెచ్ఆర్ జిఎం అవినాష్ కుమార్ దేవ్ మరణించడం పట్ల కంపెనీ తీవ్ర పరితాపాన్ని వ్యక్తం చేసింది. మనేసర్ ప్లాంట్‌చెలరేగిన మూకుమ్మడి హింసాకాండ, దహనకాండ తమను తీవ్ర ఆందోళనకు గురిచేసినట్టు మారుతి సుజుకీ పేర్కొంది. కార్మికులు దాడి చేసి కొట్టడం వల్ల దాదాపు 100 మంది సీనియర్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులు గాయపడి ఆస్పత్రి పాలైనట్టుగా వెల్లడించింది. ఈ తరహా ఘర్షణలు, అల్లర్ల ప్రభావం ఒక కంపెనీ, ఒక ప్రాంతానికే పరిమితం కావని వీటి పర్యవసానాలు ప్రభావాలు, కంపెనీకి, ప్రాంతాన్ని కూడా అధిగమించి ఉంటుందని మారుతి సుజుకీ పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more