Inflation in june declines to 725 food prices harden

Inflation in June declines to 7.25%; food prices harden,Inflation,June inflation,Food prices,June vegetable prices

Inflation in June declines to 7.25%; food prices harden

Inflation.gif

Posted: 07/17/2012 02:56 PM IST
Inflation in june declines to 725 food prices harden

Inflation in June declines to 7.25%; food prices harden

ధరల జోరుకు ఎట్టకేలకు బ్రేకులు పడ్డాయి. జూన్ నెలలో ఉత్ప త్తి రంగంలో ధరలు కొంతవరకూ ఉపశమించాయి. చమురు ధరల వేడి సై తం తక్కువగానే ఉండటంతో ద్రవ్యోల్బణం 7.25 శాతానికి దిగివచ్చింది. మే నెలలో ద్రవ్యోల్బణం 7.55 శాతం. గత ఏడాదితో పోల్చితే ద్రవ్యోల్బ ణం(9.51%) గణనీయంగానే క్షీణించింది. అయితే.. ఆహారోత్పత్తుల ధరలు మాత్రం తారాస్థాయిలోనే ఉన్నాయి.రిజర్వు బ్యాంక్ అత్యంత అనుకూలంగా భావించే స్థాయిలో జూన్ నెల ద్రవ్యోల్బణ గణాంకాలు లేవు. అందువల్ల వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ధరల దూకుడు కొంతవరకైనా తగ్గడంతో వడ్డీరేట్లు తగ్గించమంటూ కార్పొరేట్ రంగం నుంచి డిమాండ్లు మొదలయ్యాయి. ఇంధన సబ్సిడీలకు కళ్లెం వేసి వడ్డీరేట్లను తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండూ జరగకపోవచ్చని ఎనలిస్టులు అంటున్నారు. వేడి తగ్గలేదు.. ఎన్ని వ్యూహాలు పన్నినా.. మరెన్ని ప్రణాళికలు అమలు చేసినా.. ఆహార ధరలు మాత్రం నేలకు దిగిరావడం లేదు. జూన్ నెలలో ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 10.81 శాతానికి పెరిగింది. మే నెలలో ఇది 10.74 శాతం మాత్రమే. గత ఏడాది జూన్‌లో ఆహార ద్రవ్యోల్బణం 7.6 శాతంగా ఉంది. గత ఏడాదితో పోల్చితే మొత్తం ద్రవ్యోల్బణం భారీగా తగ్గినా.. ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరిగినట్లైంది. టోకు ధరల సూచీలో 14.3 శాతానికి సమానమైన ఆహార ద్రవ్యోల్బణం జోరు తగ్గకపోవడం ఆందోళన కలిగించే స్థాయిలోనే ఉందని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటేక్ సింగ్ అహ్లూవాలియా అంటున్నారు.

ఆహారం, అప్రాధాన్య సరుకుల ధరల కారణంగానే ద్రవ్యోల్బణం తగ్గడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈసారి రుతు పవనాలు దారి తప్పితే ధరల దూకుడు మరింత పెరగడం ఖాయమని ప్రధాని ఆర్థిక సలహాదారు సి. రంగరాజన్ అంచనా వేస్తున్నారు. ఆర్‌బిఐ వ్యూహాలు ఉత్పత్తి రంగ ద్రవ్యోల్బణంపై పనిచేస్తున్నా.. ఆహార ద్రవ్యోల్బణం మాత్రం స్పందించడం లేదని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.అంచనాలకు ఓ మెట్టు పైనే.. దవ్యోల్బణం దూకుడు కొంతవరకూ తగ్గినా ప్రభుత్వ అంచనాలకు ఓ మె ట్టు పైనే ఉంది. కొన్ని నెలల్లో ద్రవ్యోల్బణం 7 శాతం లోపునకు దిగివస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. కానీ.. ఈ అంచనాలు వాస్తవ రూపం ధరించే అవకాశాలు తక్కువేనని ఎనలిస్టులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్‌బిఐ వడ్డీరేట్లు తగ్గించే సాహసం చేయకపోవచ్చని క్రిసిల్ చీఫ్ ఎకానమిస్ట్ డికె జోషి పేర్కొన్నారు. వర్షాభావంతో ద్రవ్యోల్బణంపై వత్తిడులు పెరిగిపోయాయని ఇక్రా సీనియర్ ఎకానమిస్ట్ అదితి నాయర్ అభిప్రాయపడ్డారు. ఇందుకు భిన్నమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణ పతనం వడ్డీరేట్ల క్షీణతకు సంకేతంగా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఆర్ గోపాలన్ అభివర్ణించగా, రుతు పవనాలు మెరుగ్గానే ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ఆహారోత్పత్తుల సరఫరా పెరిగి ధరలు తగ్గవచ్చని ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమో నారాయన్ మీనా అంటున్నారు.

Inflation in June declines to 7.25%; food prices harden

ఇది కూరగాయల దెబ్బ.. జూన్ నెలలో బియ్యం ధరలు గత ఏడాదితో పోల్చితే 6.7 శాతం పెరిగాయి. ఇదేకాలంలో గోధుమ ధరలు 7.46 శాతం, పప్పు ధాన్యాల ధరలు 6.82 శాతం పెరిగాయి. కూరగాయలైతే వేరే చెప్పనక్కరలేదు. ఈ నెలలో కూరగాయల ధరలు ఏకంగా 20.48 శాతం పెరిగాయి. మే నెలతో పోల్చితే జూన్ నెలలో పౌల్ట్రీ చికెన్ ధరలు 7 శాతం, పప్పులు 6 శాతం పెరగ్గా, పండ్లు, కూరగాయల ధరలు రెండుశాతం చొప్పున పెరిగాయి. తేయాకు, పాలు, గోధుమ, వేటమాంసం ధరలు ఒకశాతం చొప్పున పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. జూన్ నెలలో ఉత్పత్తి రంగ ద్రవ్యోల్బణం 7.9 శాతం నుంచి 5 శాతానికి దిగివచ్చింది. ఉత్పత్తి రంగం విషయానికి వస్తే.. ముడి ఇనుము ధరలు 13.64 శాతం పెరగ్గా, వంటనూనెల ధరలు 9.82 శాతం పెరిగాయి. జూన్ నెలలో ద్రవ్యోల్బణం జోరు తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maruti labour standoff at manesar plant may hit investment climate
Yahoo names top google executive as new ceo  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles