మనదేశంలో అత్యంత సంపన్నమైన భారతీయుడిగా రియలన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మెన్ ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచాడు. చైనాకు చెందిన హ్యూరన్ సంస్థ భారత సంపన్నుల జాబితాను విడుదల చేసింది. గత ఏడాది మొదటి స్థానంలో నిలిచిన ముకేష్ అంబానీ ఈ ఏడాది కూడా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆయన సపంద 1,890 కోట్ల డాలర్లు ఉన్నట్లు తెలిపింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈయన సంపద రెండు శాతం క్షీణించినా ఈయనకే మొదటి స్థానం దక్కడం విశేషం.
ఆయన తరువాత ఉక్కు సామ్రాట్ లక్ష్మీ మిట్టల్ 1,590 కోట్ల డాలర్లతో రెండోస్థానంలో ఉన్నారు. సంపద గత ఏడాదితో పోల్చితే 6% తగ్గింది. మూడో స్థానంలో ఉన్న సన్‌ఫార్మా వ్యవస్థాపకులు, దిలీప్ సంఘ్వి టాప్ 3లో చోటు దక్కింది. ఈయన సంపాదన గత సంవత్సరం కంటే ఈ ఏడాది 66 శాతం పెరగడంతో ఆయనకు ఈ స్థానం దక్కింది. విప్రో అజీమ్ ప్రేమ్‌జీ 1,200 కోట్ల డాలర్లతో నాలుగో స్థానంలో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శివ్ నాడార్ 860 కోట్ల డాలర్లతో ఐదో స్థానంలో ఉన్నారు.
గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కుమార మంగళం బిర్లా 840 కోట్ల డాలర్లతో 6వ స్థానంలో, 810 కోట్ల డాలర్లతో గోద్రెజ్ గ్రూప్ ఆది గోద్రెజ్ ఏడో స్థానంలో నిలిచారు. షాపూర్జీ పల్లోంజీ అండ్‌కో కె చెందిన పల్లోంజి మిస్త్రీ 800 కోట్ల డాలర్లతో ఎనిమిదో స్థానంలో, 760 కోట్ల డాలర్లతో ఎస్సార్ ఎనర్జీకి చెందిన శశి, రవి రుయాలు 9వ స్థానంలో, 730 కోట్ల డాలర్లతో భారతీ ఎయిర్టెల్ సునీల్ మిట్టల్ 10వ స్థానంలో ఉన్నారు. టాప్ 10లో ఈ ముగ్గురు ఈ ఏడాది చోటు సాధించారు. ఓపీ జిందాల్ గ్రూప్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ సావిత్రీ జిందాల్ అత్యంత సంపన్న మహిళ(510 కోట్ల డాలర్లు)గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో అను అగా, కిరణ్ మజుందార్ షా (బయోకాన్), శోభన భర్తియ స్థానం దక్కించుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more