Rbi raises repo rate by 25

RBI,Rupee,Raghuram Rajan,credit policy,US Federal reserve,spread,INTERNATIONAL MONETARY FUND,interest rates,Inflation,high inflation

The RBI on Tuesday raised repo rate by 25 basis points (bps) to 7.75 percent to fight stubbornly high inflation. The RBI left the CRR unchanged.

మళ్ళీ వడ్డీ రేట్లను పెంచిన రాజన్

Posted: 10/29/2013 01:26 PM IST
Rbi raises repo rate by 25

రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ ) నేడు ద్రవ్య పరపతి విధాన సమీక్షను నిర్వహించింది. ఈ సమీక్షలో ఆర్ బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వడ్డి రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా వెలువడిన సంకేతాల ప్రకారం వడ్డీ రేట్లను 0.25 శాతంకు పెంచుతూ ఆర్బీఐ తన పరపతి విధానాన్ని ప్రకటించింది. వడ్డీ రేట్ల పెంపు తర్వాత రెపోరేటు 7.75 శాతం అయింది. అయితే సీఆర్ఆర్లో మాత్రం ఎటువంటి తేడా లేదు.
ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానాన్ని గవర్నర్ రఘురామ్ రాజన్ ఆధ్వర్యంలో నేడు సమీక్షించారు.

అనుకూల వాతావరణ పరిస్థితులతో పాటు , ఎగుమతులు పెరగడంతో  అధిక వృద్ధి నమోదవుతుందనే అంచానాలతోనే వడ్డీ రేట్లు పెంచినట్లు ఆయన తెలిపారు.  వడ్డీ రేట్లు పెంపుతో గృహ, వాహన రుణాలు మరింత ప్రియం కానున్నాయి. ఇక ఆహార పదార్ధాల ధరలు కట్టడి చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని ,ద్రవ్యోల్బం 6 శాతానికే పరిమితం అవుతందని అంచనా వేస్తున్నట్లు ఆర్‌బిఐ తెలియచేసింది. .ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాను.5.5శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. రిటైల్ ద్రవ్యోల్బణం 9 శాతానికి పైగానే ఉందని, ఎగుమతులు పెరిగాయని, బంగారం దిగుమతి తగ్గిందని ఈయన వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles