Google launches andriod one phone into indian markets

Android One, smartphones, Google, 5mp camera, ruppees 6399, Indian market

Google launches Andriod one phone into indian markets, sets price to Rs.6399

భారతీయ మార్కెట్ లోకి గూగుల్ స్మార్ట్ ఫోన్లు

Posted: 09/16/2014 10:23 AM IST
Google launches andriod one phone into indian markets

ఎంతో కాలంగా వేచి చూస్తున్న అండ్రాయిడ్‌ వన్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఇంటర్నెట్‌ సర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ దేశ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.6,399గా నిర్ణయించింది. ఆండ్రాయిడ్‌ వన్‌ స్మార్ట్‌ఫోన్‌ను తొలుత ప్లిప్‌కార్ట్‌, అమజాన్‌, స్నాప్‌డీల్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలపై విక్రయిస్తున్నట్లు గూగుల్‌ వెల్లడించింది. ఆండ్రాయిడ్‌ ఆధారంగా పని చేసే ఈ స్మార్ట్‌ఫోన్లను మైక్రోమాక్స్‌, స్పైస్‌, కార్బన్‌లు విక్రయిస్తున్నాయి. గూగల్‌ ఆండ్రాయిడ్‌ వన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుందర్‌ పిచాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలిసారి భారత్‌లో దీన్ని విడుదల చేస్తున్నామన్నారు. త్వరలోనే ఫిలిప్పిన్స్‌, ఇండోనేషియా, నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక తదితర దేశాలకు విస్తరిస్తామని తెలిపారు.

ఆండ్రాయిడ్‌ వన్‌లో ఇది ప్రారంభం మాత్రమేనని, త్వరలోనే మరిన్ని మోడళ్లు వస్తాయని పేర్కొన్నారు. త్వరలోనే ఇంటెక్స్‌, హెచ్‌టిసి, లావా, జోలో, లెనివో తయారీదార్లు ఈ సాఫ్ట్‌వేర్‌లోకి వస్తాయన్నారు. ఆన్‌లైన్‌ మార్కెట్లోనే కాకుండా 2 లక్షల రిటైల్‌ స్టోర్లలోనూ తమ ఫోన్లను అందుబాటులో ఉంచుతామన్నారు. 4.5 అంగుళాల టచ్స్క్రీన్తో డిజైన్ చేసిన ఈ ఫోన్‌లో డ్యూయల్ సిమ్, క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, ఎఫ్‌ఎం రేడియో, ఒక జిబి ర్యామ్, 4 జిబి ఇంటర్నల్ స్టోరేజీ(దీనిని 32 జిబికి పెంచుకోవచ్చు), మైక్రో ఎస్‌డీకార్డు వంటి ఫీచర్లు ఉన్నాయి. 5 మెగాఫిక్సెల్ కెమెరా కూడా దీనిలో ఉంది. భారీ స్థాయిలో భారత్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలను సాగించాలన్న యోచనలో గూగుల్ ఉంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Android One  smartphones  Google  5mp camera  ruppees 6399  

Other Articles