సాఫ్ట్ వేర్ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త అధ్యయనానికి తెరలేపింది. ఇన్నాళ్లు కేవలం సాప్ట్ వేర్ రంగంలోనే పట్టుసాధిస్తూ నెంబర్ వన్ స్థానంలో నిలిచిన మైక్రోసాప్ట్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే నోకియా మోబైల్ ఫోన్ల సంస్థను కొనుగోలు చేసిన మైక్రోసాప్ట్.. తాజాగా ప్రపంచవ్యాప్తంగా పరిచయమైన మైన్ క్రాఫ్ట్ గేమ్ ను కూడా కోనుగోలు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే ఒప్పందాలు కూడా జరిగిపోయాయి. మైక్రోసాప్ట్ సీఈఓగా సత్య నాదేళ్ల రావడంతో.. సంస్థను కొత్త పుంతలు తొక్కించడంలో క్రియాశీలక భూమిక పోషిస్తున్నారు. సుమారు రెండున్నర బిలియన్ అమెరికా డాల్లర్ల ( మన కెరెన్సీలో సుమారు 15 వేల 28 కోట్ల )తో ఈ గేమ్ ను సొంతం చేసుకునేందుకు అంగీకారం కుదిరింది.
పిల్లలాడుకునేందు తల్లిదండ్రులు అనుమతించే గేమ్ మైన్ క్రాఫ్ట్ ఒక్కటే
ప్రపంచవ్యాప్తంగా పిల్లలాడుకునేందు తల్లిదండ్రులు అనుమతించే గేమ్ మైన్ క్రాఫ్ట్ ఒక్కటేనని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదేళ్ల అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న మైన్ క్రాప్ట్ గేమ్ తో పాటు డెవలపర్ మోజాంగ్ ను కూడా కొనుగోలు పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మైక్రోసాప్ట్ మోజాంగ్ ను కొనుగోలు చేస్తుందా అంటూ నిద్రలేవగానే తన పదేళ్ల కూతురు వచ్చి అడింగిదని, అంతటి పాపులారిటీ వున్న గేమ్ ను టేకోవర్ చేస్తున్నందుకు సంతోషంగా వుందన్నారు. ఈ గేమ్ విద్యతో పాటు వికాసాన్ని కూడా చిన్నారులకు అందిస్తుందని సత్యనాదేళ్ల పేర్కొన్నారు. బలమైన కమ్యూనిటీ ద్వారా బహిరంగ ప్రపంచ వేదికపై వున్న ఈ గేమ్ పట్ల తమ సంస్థ అతి జాగ్రత్తగా సంరక్షణ చర్యలు చేపడుతుందన్నారు. మరన్ని ఉన్నతమైన కోత్త అవకాశాలతో కమ్యూనిటీ మొప్పు పొందేందుకు కృషి చేస్తామన్నారు.
ఇంతింతై వటుడింతై...
చిన్నపాటి గేమ్ లను డిజైన్ చేసి.. పిల్లలు అడేందుకు వీలుగా రంగంలోకి వచ్చిన స్టాక్ హోమ్స్ డెవలపర్.. అనతి కాలంలో వట వృక్షంగా మారింది. ఇంతింతై వటుడింతై అన్న చందంగా.. చిన్నపాటి టర్నోవర్ తో ప్రారంభమైన మోజాంగ్ సంస్థ కేవలం 40 మంది ఉద్యోగులతో గత ఏడాది 2.05 బిలియన్ రెవెన్యూను చేజిక్కించుకోగా, అందులో 896 డాలర్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2011లో పూర్తిస్థాయిలో గేమ్ విడుదలైనప్పటి నుంచి స్మార్ట్ ఫోన్ల వినియోగదారులను టార్గెట్ చేసుకున్న ఈ సంస్థ ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందంటే అతిశయోక్తి కాదు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more