Sensex reclaims 27k level soars over 450 points

stock market, sensex, nifty, profits, bull run

Sensex reclaims 27K level, soars over 450 points

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Posted: 09/18/2014 05:19 PM IST
Sensex reclaims 27k level soars over 450 points

విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో స్టాక్ మార్కెట్లు లాభాలలో పయనిస్తున్నాయి. మదుపరులు కొనుగోళ్లకు ఆస్తక్తి కనబడర్చడంతో వరుసగా రెండో రోజు దేశీయ సూచీలు పరుగులు పెట్టాయి, సెన్సెక్స్ ఏకంగా 450 పాయింట్ల మేర లాభపడగా, నిష్టీ కూడా 140 పాయింట్ల మేర లాభాలను మూటగట్టుకుంది. గత వారాంతంలో భారీ నష్టాలతో.. కొత్త రికార్డులను చేజార్చుకున్న దేశీయ సూచీలు ఇవాళ తిరిగి వాటిని సాధించాయి. సెన్సెక్స్ 27 మార్కును మరోమారు దాటగా, నిఫ్టీ 8 వేల మార్కును దాటింది.

ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే నష్టాలను చవిచూసిన సెన్సెక్.. ఆ తరువాత క్రమంగా కోలుకుంది. మార్కెట్ ప్రారంభంలో 137పాయింట్ల నష్టంతో సెన్సెక్స్.. 26 వేల 512 పాయింట్ల వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి క్రమంగా కోలుకున్న మార్కెట్.. మరో గంటలో 250 పాయింట్ల లాభంతో 26 వేల 879 పాయింట్ల వద్దకు చేరుకుంది. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 481 పాయింట్ల లాభంతో 27 వేల 112 పాయింట్ల వద్ద ముగిసింది.

వారారంభంలో రెండు రోజుల వరుస నష్టాలతో ఎనమిది వేల పాయింట్లకు దిగువన ట్రేడింగ్ సాగించిన నిఫ్టీ కూడా 140 పాయింట్ల లాభంతో ఎనమిది వేలకు మార్కుకు పైన ట్రేడింగ్ సాగించింది. మార్కెట్ ముగిసే సమాయానికి నిఫ్టీ కూడా 8 వేల 115 పాయింట్ల వద్ద నిలిచింది. హీరో మోటార్ కార్పోరేషన్, హెచ్ డీ ఎఫ్ సీ, టాటా మోటార్, ఎల్ అండ్ టి, బిహెచ్ఈఎల్ సంస్థల షేర్లు మూడు శాతం మేర లాభాలను గడించగా, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనీలీవర్ సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

మరింత తగ్గిన బంగారం ధర
దేశీయ సూచీల ప్రభావం భారతీయ బులియన్ మార్కెట్ పై పడింది. ముంబాయి బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర తగ్గింది. నిన్నటి ట్రేడింగ్ లో స్వల్ప నష్టాన్ని నమోదు చేసుకున్న పసిడి.. ఇవాళ సుమారు 251 రూపాయలను నష్టపోయి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 26 వేల 650 రూపాయలుగా నమోదు చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : stock market  sensex  nifty  

Other Articles