Sensex & Nifty rally for 4th day, Fed meet outcome eyed

Sensex nifty rally for 4th day

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

Globally, every market is waiting for the outcome of two-day meeting held by Federal Open Market Committee. Experts don’t see any rate hike tonight.

వరుసగా నాలుగో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

Posted: 06/17/2015 07:06 PM IST
Sensex nifty rally for 4th day

దేశీయ స్టాక్ మార్కట్లు వరుసగా నాల్గవ రోజు లాభాలను ఆర్జించాయి. విదేశాల నుంచి వచ్చిన సానుకూల పవనాలకు తోడు భారత వాతావరణశాఖ ఐఎండీ విడుదల చేసిన తాజా వర్షాభావ పరిస్థితుల అంచనాలకు తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా....నైరుతి రుతు పవనాలు విస్తరించి వుండటం కూడా బుల్ రన్ కు కారణంగా మారాయి. ఈ నేపథ్యంలో మదుపరుల సెంటిమెంటుతో కోనుగోళ్లకు మదుపరులు ఆసక్తిని కనబర్చారు. దీంతో మార్కెట్లు ఉదయం ప్రారంభం నుంచే లాభాల బాటలో పయనించాయి.

హెల్త్ కేర్ , కన్జూమర్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్, అటో ఎఫ్ ఎం జీ సీ, టెక్నాలజీ, అయిల్ అండ్ గ్యాస్ సూచీలు, ఐటీ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల సూచీలు లాభాల్లో పయనించడంతో.. మార్కెట్లు లాభాలను పుంజుకున్నాయి. కాగా బ్యాకింగ్, పబ్లిక్ సెక్టార్ యూనిట్ లకు సంబంధించిన సూచీల నష్టాలలో పయనించడంతో.. ఆయా రంగానికి చెందిన సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

కాగా మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 146 పాయింట్ల లాభంతో 26 వేల 833 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించగా, నిఫ్టీ 44 పాయింట్లు ఆర్జించి 8092 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది. ఈ క్రమంలో సిప్లా, హిదుస్థాన్ యూనీ లీవర్, హిండాల్కో, రిలయన్స్, టాటా స్టీల్ తదితర సంస్థల షేర్లు లాభాల భాటలో పయనించగా, వీఈడిఎల్, పవర్ గ్రిడ్, టాటా పవర్, బిహెచ్ఈఎల్, కాయిర్న్ ఇండియా తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టకున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  

Other Articles