Sensex zooms 283 points on dovish Fed comments; Reliance leads

Sensex nifty rally for 5th day

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

Globally, every market is waiting for the outcome of two-day meeting held by Federal Open Market Committee. Experts don’t see any rate hike tonight.

భారీ లాభాలతో రెండు వారాల గరిష్ట స్తాయికి స్టాక్ మార్కెట్లు..

Posted: 06/18/2015 07:20 PM IST
Sensex nifty rally for 5th day

దేశీయ స్టాక్ మార్కట్లు వరుసగా ఐదవ రోజు లాభాలను ఆర్జించాయి. విదేశాల నుంచి వచ్చిన సానుకూల పవనాల నేపథ్యంలో ఇవాళ భారీగా లాభాలను నమోదు చేసుకున్న స్టాక్ మార్కెట్లు రెండు వారాల గరిష్ట స్థాయికి చేరాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు తన ద్రవ్య పరపతి విధానంపై నిర్ణయం తీసుకుంటుందన్న వార్తల నేపథ్యంలో మదుపు దారులు భారత్ మార్కెట్లలో పెట్టబడులకు ఆస్తకి కనబర్చడంతో.. స్టాక్ మార్కెట్లు లాభాలను పుంజుకున్నాయి. ఏకంగా ఒక్క శాతానికి పైగా లాభాలను దేశీయ సూచీలు అందుకోగలిగాయి. ఆయిల్ అండ్ రిఫైనరీ, ఫార్మ రంగ సూచీలు ర్యాలీని కోనసాగించడంతో.. మార్కట్లు లాభాలను నమోదు చేసుకున్నాయి.

ఉదయం ప్రారంభం నుంచే మార్కెట్లు లాభాలను నమోదు చేసుకుని.. చివరి వరకు అదే ఒరవడిని కొనసాగించాయి. ఒక్క లోభానికి సంబంధించిన సూచీ మినహా అన్ని సూచీలు ఇవాళ లాభాలను నమోదు చేసుకున్నాయి. అయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్ , కన్జూమర్ గూడ్స్,అటో, చిన్న తరహా పరిశ్రమల సూచీలు ర్యాలీని కొనసాగించాయి. ఇక క్యాపిటల్ గూడ్స్ ఎఫ్ ఎం జీ సీ, టెక్నాలజీ సూచీలు, ఐటీ, మధ్య తరహా పరిశ్రమల సూచీలు లాభాల్లో పయనించడంతో.. మార్కెట్లు లాభాలను పుంజుకున్నాయి. కాగా లోహ రంగానికి సంబంధించిన  సూచీలు కూడా స్వల్పంగానే నష్టాలను మూటగట్టుకున్నాయి.

కాగా మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 283 పాయింట్ల లాభంతో 27 వేల 115 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించగా, నిఫ్టీ 83 పాయింట్లు ఆర్జించి 8174 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది. ఈ క్రమంలో సిప్లా, హిదుస్థాన్ యూనీ లీవర్, హిండాల్కో, రిలయన్స్, టాటా స్టీల్ తదితర సంస్థల షేర్లు లాభాల భాటలో పయనించగా, వీఈడిఎల్, పవర్ గ్రిడ్, టాటా పవర్, బిహెచ్ఈఎల్, కాయిర్న్ ఇండియా తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టకున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  

Other Articles