మేక్ ఇన్ ఇండియాకు పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం స్పూర్తితో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మేడ్చల్ లో ప్రారంభించిన తమ సెల్‌కాన్ సంస్థ టార్గెట్ నెలకు 7 లక్షల మేర మొబైల్ హ్యాండ్‌సెట్ల ఉత్పత్తి చేయడమేనని సదరు సంస్థ చైర్మన్ అండ్ మేజేజింగ్ డైరెక్టర్ వై గురు అన్నారు. ఈ ప్లాంటును శుక్రవారం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్బాన్న పురస్కరించుకుని సెల్‌కాన్ సీఎండీ వై. గురు మాట్లాడుతూ తొలుత నెలకు 2 లక్షల ఫోన్లను అసెంబుల్ చేయనున్నామని తెలిపారు. ఈ సామర్థ్యాన్ని 5 లక్షల యూనిట్ల పెంచుతామని అన్నారు. దేశీయంగా తయారీతో మోడళ్ల ధర 7`8 శాతం తగ్గనుందన్నారు. ఇప్పటి వరకు మేడ్ ఇన్ చైనా పేరుతో వచ్చిన కంపెనీ ఫోన్లు ఇక నుంచి మేడ్ ఇన్ ఇండియాగా కూడా రానున్నాయని ఈ యూనిట్ ఏర్పాటుపై 250 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపారు.
దక్షిణాదిన అసెంబ్లింగ్ ప్లాంట్ ఏర్పాటవడం ఇదే తొలిసారి అని అన్నారు. ఇతర కంపెనీలూ దక్షిణాదికి వచ్చేందుకు మార్గం సుగమం అయిందని అన్నారు. ప్రారంభంలో ఇక్కడ ఫీచర్‌ఫోన్లు, ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్లు తయారు చేస్తామని, తదుపరి దశలో హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ల తయారీని కూడా చేపడతామని తెలిపారు. ఈ యూనిట్‌లో 500 మంది నిపుణులు, స్కిల్డ్ సిబ్బంది పనిచేస్తారని, వాకు కాకుండా అదనంగా మరి కొంత మంది సాదారణ ఉద్యోగులను కూడా తీసుకుంటామని తెలిపారు. తాము నెలకి ఏడు లక్షల హ్యాండ్‌సెట్లు విక్రయిస్తున్నామని తెలిపారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more