విదేశాల నుంచి వచ్చిన ప్రతికూల వాతావరణ పవనాలకు తోడు.. గ్రీస్ సంక్షోభం, చైనా ఉత్పాతాల ప్రభావాలతో స్టాక్ మార్కెట్లు వరుసగా రెండవ రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిన్న ఈ ఏడాదిలో తొలిసారిగా అత్యంత భారీ నష్టానికి కుదేలయిన మార్కెట్లు ఇవాళ కూడా అదే బాటలో నడిచాయి. ఇవాళ ఉదయం ఆరంభంలో మార్కెట్లను లాభాలు పలకరించాయి. ఆ తరువాత స్వల్ప ఒడిదోడుకులను ఎదుర్కోంటూ.. క్రమంగా మధ్యాహ్నానికి లాభాలను హరించుకుపోయాయి. దీంతో మార్కెట్లు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. మధ్యాహ్నం తరువాత మర్కాట్ స్టాల్స్ లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
మార్కెట్లు ముగిసే సమయానికి 114 పాయింట్ల నష్టంతో 27 వేల 574 పాయింట్ల వద్ద ముగియగా, నిప్టీ కూడా 35 పాయింట్ల నష్టంతో 8329 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ మొత్తంగా 1529 షేర్లు లాభాల బాటలో పయనించగా, 1283 షేర్లు నష్టాలను చవిచూశాయి. కాగా 153 సంస్థలకు చెందిన షేర్లు మాత్రం తటస్థంగా నిలిచాయి. ఈ క్రమంలో అయిల్ అండ్ గ్యాస్, ఐటీ, అటో రంగ సూచీలు భారీ నష్టాలలో పయనించగా, ఎఫ్ ఎం జీ సీ, మెటల్స్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ, చిన్న తరహా, మద్య తరహా పరిశ్రమలకు చెందిన సూచీలు కూడా నష్టానలు ఎదుర్కోన్నాయి. క్యాపిటల్ గూడ్స్ రంగానికి చెందిన సూచీలు భారీ లాభాలను ఆర్జించగా, బ్యాంకింగ్ రంగ సూచీలఃతో పాటు కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్ సూచీలు స్వల్ప లాభాలను ఆర్జించాయి. ఈ క్రమంలో వేదాంత, టీసీఎస్, బజాజ్ ఆటో, ఇన్పోసిస్, టాటా మోటార్స్ తదితర సంస్థల షేర్లు నష్టాలను చవిచూడగా, బిహెచ్ఇఎల్, హిండాల్కో, ఎల్ అండ్ టీ, హారో, లుపిన్ తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించాయి
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more