ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విండోస్-10ను ఈ నెల 29 నుంచి ప్రపంచవ్యాప్త టెక్నాలజీ ప్రియులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సంస్థ.. పలు ప్రధాన నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన బృందంలోని సభ్యులను కలుసుకునే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ ఒక బ్లాగ్‌పోస్టులో పేర్కొంది. విండోస్ 10 ప్రస్తుతం ఉన్న ఓఎస్లన్నిటికన్నా అత్యంత వేగవంతమైనది, సురక్షితమైనదని వెల్లడించింది.
విండోస్ 7, విండోస్ 8 ఒరిజినల్ వెర్షన్లు వాడుతున్నవారెవరైనా సరే విండోస్ 10కు ఉచితంగా అప్‌గ్రేడ్ కావచ్చునని తెలిపింది. అయితే, ఈ ఆఫర్ తొలి ఏడాదికే మాత్రమే పరిమితం చేసింది. ఆ తరువాత కూడా విండోస్ 10ను వినియోగించుకోదలచుకున్న వాళ్ల సాఫ్ట్ వేర్ ను కోనుగోలు చేయాల్సిందేనని తెలిపింది. కాగా.. 29న ఓఎస్‌ను లాంచ్ చేస్తున్నప్పటికీ అందరికీ ఆ రోజు అప్‌గ్రేడ్ అందుబాటులోకి రాదని పేర్కొంది. ముందుగా దీన్ని.. ఓఎస్ తయారీలో కీలకపాత్ర పోషించిన టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంచునున్నామని తెలిపారు.
ఆ తరువాత క్రమంగా మిగతావారికి అందుబాటులోకి తెస్తామని తెలిపింది. జూలై 29 ఆ తర్వాత కొత్తగా కంప్యూటర్లు కొనుగోలు చేసేవారికి ప్రాధాన్యమిస్తారు. కాగా విండోస్ 10లో మళ్లీ స్టార్ట్‌మెనూ జోడించారు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనే సరికొత్త బ్రౌజర్‌ను పొందుపరిచారు. మనం అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ వ్యక్తిగత సహాయకురాలిగా వ్యవహరించే కోర్టానా ప్రోగ్రామ్ ఉంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more