'స్పైస్ జెట్ మళ్లీ 'రెడ్ హాట్ స్పైసీ' ఆఫర్ ప్రకటించింది. రూపాయికే విమాన టికెట్.. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. కేవలం ఒక్క రూపాయి చెల్లించి విమాన ప్రయాణం చేయ్యోచ్చు. ఎంచక్కా ఎంపిక చేసుకున్న గమ్యస్థానం చేరుకోవచ్చు. అయితే ఈ తరహా టికెట్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే లభ్యం అవుతుందని, అలా చేసిన వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పైస్ జెట్ ఒక ప్రకటనలో పేర్కోంది. విమానయానాన్ని సామాన్యులకు అందుబాటులో తీసుకురావడంతో తమ వతు ప్రాత్రను పోషించిన స్పైస్ జెట్ మరోమారు రూపాయి అఫర్ ను అమల్లోకి తీసుకువచ్చింది.
ఈ ఆపర్ కింద కేవలం రూపాయికే (పన్నులు, ఫీజుల అదనం) ఒక వైపు ప్రయాణాన్ని అందించనున్నారు. అయితే ఇది రౌండ్ ట్రిప్ విమాన కోనుగోలుదారులకు మాత్రమే వర్తించనుంది. ఒక వైపు రెగ్యులర్ చార్జీల కింద టికెట్టు కోనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించననుంది. ఎంపిక చేసిన దేశీయ రూట్లలో నాన్ స్టాప్ విమాన సర్వీసులకే ఈ ఆపర్ వర్తించనుందని విమానయాన సంస్థ తెలిపింది. ఈ ఆపర్ కింద ఇవాళ్టి నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు టిక్కట్ బుకింగ్ లుఅందుబాటులో వుంటాయి. టిక్కెట్ బుక్ చేసుకునే వారు నేటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రయాణాలకు వర్తిస్తుందని, ఈ ఆఫర్ కింద లక్షకు పైగా వన్ వే టిక్కట్లను అందుబాటులో వుంచామని స్పైస్ జెట్ సంస్థ తెలిపింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more