నాలుగు రోజుల నుంచి వరుసగా ఎదుర్కొంటున్న నష్టాలకు కళ్లేలు పడటంతో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు లభాలతో ముగిసాయి. అసియా మార్కెట్లతో పాటు యూరోపియన్ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ ఫలితాలలోనూ దేశీయ సూచీలు లాభాలను ఆర్జించాయి. చైనా అర్థిక సంక్షోభంతో కూరుకుపోవడం అంశం మార్కెట్లును కొంత వరకు ప్రతికూలంగా వెంటాడినా.. అమెరికా ఫెడ్ రిజర్వు కమిటీ సమావేశం సానుకూల నిర్ణయాలను తీసుకుంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో సూచీలు లాభాల భాట పట్టాయి. .
ఉదయం ప్రారంభంతోనే 93 పాయింట్ల లాభాన్ని సెన్సెక్స్ అర్జించగా, అటు నిష్టీ కూడా 27 పాయింట్ల లాభాన్ని అర్జించింది. చివరి వరకు అదే ఒరవడిని కోనసాగించింది. అటు ఈ మాసాంతంతో డెరెవేటివ్ కాంట్రాక్టులు ముగిసిపోనున్న నేపథ్యంలో మార్కెట్లు ఒడిదోడుకులకు గురైనా చివరికి మాత్రం లాభాలనే ఆర్జించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 104 పాయింట్ల లాభంతో 27 వేల 563 పాయింట్ల వద్ద ముగియగా, నిప్టీ కూడా 38 పాయింట్ల నష్టంతో 8375 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ 1658 సంస్థల షేర్లు లాభాల మార్గంలో పయనించగా, 1178 సంస్థలకు చెందిన షేర్లు నష్టాలను చవిచూశాయి.
ఈ క్రమంలో కన్జూమర్ డ్యూరబుల్స్ సూచీకి చెందిన షేర్లు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోగా, ఎఫ్ ఎం జీ సీ, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్లకు చెందిన సూచీలు స్వల్పంగా నష్టాల బాటలో ప యనించాయి. క్యాపిటల్ గూడ్స్, అటో, ఐటీ, మధ్య తరహా రంగానికి సంబంధించిన సూచీలు భారీ లాభాలను ఆర్జించగా, బ్యాకింగ్, హెల్త్ కేర్, మొటల్స్, టెక్నాలజీ, చిన్న తరహా పరిశ్రమ రంగానాకి చెందిన సూచీలు కూడా లాభాల బాటలో పయనిచాయి. ఈ తరుణంలో బాస్చ్, హెచ్ సిలఎల్ టెక్నాలజీ, యస్ బ్యాంక్, జీ ఎంటర్ టైన్ మెంట్, ఇన్పోసిస్, సంస్థల షేర్లు లాభాలను గడించగా, టాటా పవర్, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఐటిసీ, ఎస్ బి ఐ, గెయిల్ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more