నాలుగు రోజుల వరుస లాభాలకు ఇవాళ బ్రేకులు పడ్డాయి. విదేశాల నుంచి వచ్చిన సానుకూల పవనలు కూడా భారతీయ స్టాక్ మార్కెట్లను ఆదుకోలేకపోయాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తున్నారన్న ఊహాగానాల నడువు ఉదయం నుంచి నష్టాలలో పయనించిన స్టాక్ మార్కట్లు సాయంత్రానికి కూడా నష్టాలనే మూటగట్టుకున్నాయి. ఆచ్చివచ్చిన ఆగస్టు సీరీస్ లో తొలిసారిగా నష్టాలను చవిచూశాయి. కార్పోరేట్ ల వేడుకోలు, కేంద్రప్రభుత్వం ఒత్తిళ్లను కూడా లెక్కచేయని భారతీయ రిజర్వు భ్యాంకు కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కోనసాగడంతో మార్కొట్లు అమ్మకాల ఒత్తిళ్లకు తలొగ్గక తప్పలేదు.
దీంతో అప్పటి వరకు లాభాలతో దూసుకుపోయిన మార్కెట్లు క్రమంగా నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభంలో పయనించగా, నిష్టీ 100 పాయింట్లకు పైగా కొనసాగుతూ.. 8500 మార్కును కూడా దాటిన క్రమంలో రిజర్వు బ్యాంకు తీసుకున్న నిర్ణయం మదుపరులను నిరాశకు గురిచేసింది. ఆశించిన అంచనాలు తలకిందుకులు కావడతో మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. దిగ్గజ సంస్థలకు ఇన్పోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, హెచ్ డీ ఎఫ్ సీ, తదితర సంస్థల షేర్లు మార్కెట్లను కుదిపేయగా, మధ్యతరహా, చిన్న తరహా, అటో రంగానికి చెందిన షేర్లు లాభాలను ఆర్జించినా.. మార్కెట్లు చివరకు నష్టాలతోనే ముగిశాయి.
కాగా ఇవాళ ఉదయం ప్రారంభంతోనే స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టాన్ని చవిచూడగా, అటు నిష్టీ కూడా 34 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసుకుంది. అయితే కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష అనంతరం తగ్గిస్తుందని ఆశించానా.. కేంద్ర ప్రభుత్వం నుండి ఎదురైన ఒత్తిడిని కూడా పక్కన బెట్టిన భారతీయ రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేట్లను ఏమాత్రం సవరించకుండా యథాతథంగా కోనసాగించింది. దీంతో ఉదయం నుంచి నష్టాల బాటలోనే పయనించిన మార్కెట్లు అదే స్థాయిలో పతనాన్ని చవిచూశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టాంతో 28 వేల 72 పాయింట్ల వద్ద ముగియగా, నిప్టీ కూడా 26 పాయింట్ల నష్టంతో 8517 పాయింట్ల వద్ద ముగిసింది.
ఈ క్రమంలో మెటల్స్, ఆటో, మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమలకు చెందిన సూచీలు భారీ లాభాలను ఆర్జించగా, బ్యాంకింగ్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ హెల్త్ కేర్ రంగానికి చెందిన సెక్టార్లు స్వల్ప లాభాలను ఆర్జించాయి. ఈ క్రమంలో కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, టెక్నాలజీ, ఆయల్ అండ్ గ్యాస్, ఎఫ్ ఎం జీ సీకి చెందిన సూచీలు నష్టాలను చవిచూశాయి. ఈ తరుణంలో టెక్ మహీంద్రా, టాటా స్టీల్, హిండాల్కో, బ్యాంక్ అఫ్ బరోడా, ఏషియన్ పెయింట్స్ సంస్థల షేర్లు అధిక లాభాలను గడించగా, ఐడియా సెల్యూలార్, కాయిర్న్ ఇండియా, హీరో మోటో కార్ప్, ఓఎన్ జీసీ, గెయిల్ తదితర సంస్థల షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more